Janhvi Kapoor: వాళ్లతో నటించడం కష్టం... ఎన్టీఆర్‌తో ఇష్టం: జాన్వీ కపూర్‌

అనతి కాలంలోనే ప్రత్యేకమైన ఫేమ్‌ను సంపాదించుకున్న యువనటి జాన్వీ కపూర్ ‌(Janhvi Kapoor). ఉన్నది ఉన్నట్లు, సూటిగా మాట్లాడటం ఈ ముద్దుగుమ్మ నైజం. ఆ తరహాలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలను, భవిష్యత్‌ కోరికలను నిర్మొహమాటంగా ప్రేక్షకులతో పంచుకుంది. ‘షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌....

Published : 05 Aug 2022 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనతి కాలంలోనే ప్రత్యేకమైన ఫేమ్‌ను సంపాదించుకున్న యువనటి జాన్వీ కపూర్ ‌(Janhvi Kapoor). ఉన్నది ఉన్నట్లు, సూటిగా మాట్లాడటం ఈ ముద్దుగుమ్మ నైజం. ఆ తరహాలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలను, భవిష్యత్‌ కోరికలను నిర్మొహమాటంగా ప్రేక్షకులతో పంచుకుంది. ‘షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌ వీరిలో ఎవరితో నటించడానికి మీరు ఇష్టపడతారు?’ అని అడిగిన ప్రశ్నకు... జాన్వీ ‘వాళ్లంతా సీనియర్‌ నటులు. వారికి, నాకు వయస్సులో చాలా తేడా ఉంది. అలాంటి జంటలను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఒప్పుకోరు. కెమిస్ట్రీ కూడా కుదరదు. వయోభేదం ఎక్కువ ఉండటం వల్ల వారితో నటించడం నాకు ఇష్టం లేదు’ అని సమాధానమిచ్చింది. ఇక ‘మీ డ్రీమ్‌ హీరో ఎవరు?’అని అడిగిన ప్రశ్నకు ‘తెలుగు హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌(Jr NTR)తో నటించడం నా డ్రీమ్‌’ అని బదులిచ్చింది. ఇంకా బాలీవుడ్‌లో రణ్‌బీర్‌కపూర్ ‌(Ranbir Kapoor), వరుణ్‌దావన్‌ (Varun Dhawan)లతో నటించాలనే కోరిక ఉందంటూ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్‌ తాజా సినిమా ‘గుడ్‌లక్‌ జెర్రీ’ (Good Luck Jerry) ప్రస్తుతం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) వేదికగా ప్రసారమవుతోంది. ఈమె ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిలి’(Mili), ‘మిస్టర్‌ అండ్ మిస్ట్రెస్‌ మహి’ (Mr And Mrs Mahi), ‘బవాల్’(Bawaal) చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని