NTR 30: పవర్‌ఫుల్‌ టైటిల్‌తో వచ్చిన ఎన్టీఆర్‌.. అదిరిన మాస్‌ లుక్‌

హీరో ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్‌ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ ఖరారైంది.

Published : 19 May 2023 19:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: #NTR30 టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ ఎప్పుడెప్పుడొస్తాయా? అని ఆసక్తి ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌ (NTR) అభిమానులకు చిత్ర బృందం ఆ కానుక అందించింది. హీరో పుట్టినరోజు (మే 20)ని పురస్కరించుకుని కొన్ని గంటల ముందే ఆ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమాకు ‘దేవర’ (Devara) అనే పవర్‌ఫుల్‌ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసింది. ఎన్టీఆర్‌ మాస్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ ప్రకటనకు ముందు.. ‘‘దేవర.. నేను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న టైటిల్‌. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్‌ను కొట్టేశారు’’ అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ట్వీట్‌ పెట్టడం గమనార్హం. చిత్ర బృందం ఆ పెట్టినంత మాత్రాన తనకు సమస్య లేదని, టైగర్ కూడా తనకు దేవరతో సమానమని తెలిపారు.

సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కలిసి పనిచేస్తుండడంతో #NTR30పై ఇప్పటికే  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ (janhvi kapoor), ప్రతినాయకుడిగా ప్రముఖ హీరో సైఫ్‌ (saif alikhan) అలీఖాన్‌ నటిస్తుండడంతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భయమంటే ఏమిటో తెలియని అక్కడి మృగాళ్లకు భయాన్ని రుచి చూపించేందుకు కథానాయకుడు ఏం చేశాడన్నది ఆసక్తికరం. అనిరుధ్‌ స్వరాలందిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని