NTR 30: యంగ్ టైగర్ కొత్త సినిమా షురూ.. బ్యాక్‌డ్రాప్ చెప్పేసిన కొరటాల శివ
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ (NTR) నటిస్తోన్న కొత్త సినిమా నేడు అధికారికంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది.
హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కొత్త సినిమా మొదలైంది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత కల్యాణ్ రామ్ తదితరులు సందడి చేశారు. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం.. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఎన్టీఆర్-జాన్వీకపూర్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు జక్కన్న క్లాప్ కొట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. #NTR30, #NTR30StormBegins వంటి హ్యాష్‌ట్యాగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
ఎన్టీఆర్‌ని చూసి.. జాన్వీ ఫుల్ ఖుష్..!
‘ఎన్టీఆర్30’ పూజా కార్యక్రమంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్రబృందంతో ఆమె కలివిడిగా కనిపించారు. తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌ని కలిసిన సమయంలో ఆమె ఆనందం మరోస్థాయిలో ఉంది. ఎన్టీఆర్ పలకరించగా.. ఆమె ఎంతో ఆనందించారు. కాసేపు సరదాగా మాట్లాడారు. అలాగే రాజమౌళితోనూ ఆమె ముచ్చటించారు.
బ్యాక్‌డ్రాప్ ఇదే..!
‘‘జనతా గ్యారేజ్’ తర్వాత నా సోదరుడు, ఈ జనరేషన్‌లో ఉన్న గొప్ప నటుల్లో ఒకరైన ఎన్టీఆర్‌తో కలిసి మరోసారి వర్క్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని రూపొందిస్తున్నాం. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువగా మృగాళ్లు ఉంటారు. భయం అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. దేవుడంటే భయం లేదు. చావు అంటే భయం లేదు. కానీ.. వాళ్లకు ఒకే ఒక్కటంటే భయం. ఆ భయమేంటో మీకు తెలిసే ఉంటుంది. ఇదే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్. భయం ఉండాలి. భయం అవసరం. భయపెట్టడానికి ప్రధాన పాత్ర ఏ స్థాయికి వెళ్తుందనేది.. ఒక ఎమోషనల్ రైడ్. దీన్ని భారీ స్థాయిలో తీసుకువస్తున్నాం. నా కెరీర్‌లో ఇది బెస్ట్ అవుతుందని అందరికీ మాటిస్తున్నా. ఈ కథ చెప్పిన వెంటనే.. ‘‘ఫైర్‌తో రాశారు సర్’’ అని అనిరుధ్ అన్నాడు. ఇలాంటి టీమ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని కొరటాల శివ (Koratala Siva) వివరించారు.
మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్