NTR: మాస్ ‘దేవర’
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో విప్లవ వీరుడు కొమురం భీమ్‌గా సందడి చేసి సినీప్రియుల్ని మెప్పించారు కథానాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడాయన ‘దేవర’గా మరో కొత్త అవతారంలో మురిపించేందుకు సిద్ధమవుతున్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రంలో విప్లవ వీరుడు కొమురం భీమ్‌గా సందడి చేసి సినీప్రియుల్ని మెప్పించారు కథానాయకుడు ఎన్టీఆర్ (NTR). ఇప్పుడాయన ‘దేవర’ (Devara)గా మరో కొత్త అవతారంలో మురిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రమిది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శనివారం ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి ‘దేవర’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో తారక్ శక్తిమంతమైన మాస్ గెటప్‌లో సముద్రంలో ఓ రాయిపై నుంచొని సీరియస్‌గా చూస్తూ కనిపించారు. ఓ చేతిలో నెత్తుటితో తడిచిన కత్తి ఉండగా.. చుట్టూ శత్రు మూకల శవాలు గుట్టలుగా పడి ఉండటం ఆసక్తిరేకెత్తిస్తోంది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. అక్కడ ఉండే భయం తెలియని మృగాళ్లకు భయాన్ని పరిచయం చేసే శక్తిమంతమైన పాత్రలో తారక్ కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Hyderabad: సికింద్రాబాద్‌లో సినీ ఫక్కీలో దోపిడీ మహారాష్ట్ర ముఠా పనేనా?
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు మోస్తరు వర్షాలు
-
Sports News
MS Dhoni: ‘ధోనీ అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్’
-
Politics News
Harishrao: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్: మంత్రి హరీశ్‌రావు
-
World News
China: బోయింగ్, ఎయిర్‌బస్‌కు పోటీగా చైనా ప్యాసింజర్ విమానం..!