NTR 30: ముహూర్తం ఖరారు

కథానాయకుడు ఎన్టీఆర్‌ 30 (NTR30)వ చిత్రానికి ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ఈనెల 23న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది.

Updated : 19 Mar 2023 06:59 IST

కథానాయకుడు ఎన్టీఆర్‌ 30 (NTR 30)వ చిత్రానికి ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా ఈనెల 23న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) వంటి హిట్‌ తర్వాత తారక్‌ చేస్తున్న చిత్రమిది. కొరటాల శివ (Koratala Siava) తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) కనిపించనుంది. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు.  అనిరుధ్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని