NTR 31: ఎన్టీఆర్‌ 31 ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. ఇంట్రెస్టింగ్‌ లుక్‌లో తారక్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో ఓసినిమా సిద్ధం కానున్న సంగతి తెలిసిందే. త్వరలో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ బయటకు వచ్చింది...

Updated : 20 May 2022 12:55 IST

హైదరాబాద్‌: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌-ప్రశాంత్‌నీల్‌ కాంబినేషన్‌లో ఓసినిమా సిద్ధం కానున్న సంగతి తెలిసిందే. త్వరలో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ బయటకు వచ్చింది. శుక్రవారం తారక్‌ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ రిలీజ్‌ చేశారు. ‘‘రక్తంతో తడిచిన నేల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే, ఈ నేలే ఆయన వారసత్వం.. రక్తం కాదు’’ అని ప్రశాంత్‌ నీల్‌ పేర్కొన్నారు. ఇందులో తారక్‌.. ఇంటెన్స్‌ లుక్‌లో ఫుల్‌ యాంగ్రీగా కనిపించారు. NTR31గా ఇది ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో కియారా లేదా రష్మిక కథానాయికగా కనిపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నట్లు దర్శకుడు తెలిపారు. స్థానిక మీడియాతో తాజాగా ముచ్చటించిన ప్రశాంత్‌నీల్‌ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ‘‘20 ఏళ్ల క్రితమే నాలో ఈ కథ ఆలోచన మెదిలింది. ఈ కథ స్థాయి, పరిమాణం భారీగా ఉండటంతో ఇంతకాలం వెనక్కి తగ్గాను. ఎట్టకేలకు నా కలల ప్రాజెక్ట్‌ని నా డ్రీమ్‌ హీరోతో తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది’’ ప్రశాంత్‌నీల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని