HBD NTR: 9999 సంగతి ఇదీ

సినిమా వాళ్లలో చాలామందికి సెంటిమెంట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ 9999 (కారు నంబరు) విషయంలో ఇదే అనుకుంటుంటారు. కానీ, కాదు.

Updated : 20 May 2021 12:17 IST

ఇంటర్నెట్ డెస్క్: సినిమా వాళ్లలో చాలామందికి సెంటిమెంట్ ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ 9999 (కారు నంబరు) విషయంలో ఇదే అనుకుంటుంటారు. కానీ, కాదు. 9999 నంబరు.. ఎందుకు ఎంపిక చేసుకున్నారో ఓ సందర్భంలో ఇలా వివరించారు తారక్. 'సెంటిమెంట్స్‌పై నాకు పెద్దగా నమ్మకం లేదు. కానీ 9 అంకె అంటే చాలా ఇష్టం. తాతగారి (సీనియర్ ఎన్టీఆర్) కారు నంబరు 9999. అదే నంబరు నాన్న (హరికృష్ణ) కారుకి కనిపించేది. వాళ్లిద్దరినీ ఆరాధించే వ్యక్తిగా... నాకూ ఆ నంబరు అంటే మక్కువ పెరిగింది' అని తెలిపారు. కారు నంబరే కాదు తారక్  ట్విటర్ ఖాతాలోనూ 9999 కనిపిస్తుంది. సినిమా విషయానికొస్తే 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నారాయన. ఇది పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో న‌టించ‌నున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని