NTR: నష్టం వచ్చినా పర్వాలేదు!

అలనాటి నటుడు ఎన్.టి.రామారావు ఏదైనా అనుకున్నారంటే అది పూర్తయ్యే వరకూ నిద్రపోయే వారుకాదు.

Published : 14 Feb 2022 17:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అలనాటి నటుడు ఎన్.టి.రామారావు ఏదైనా అనుకున్నారంటే అది పూర్తయ్యే వరకూ నిద్రపోయే వారుకాదు. ఇక సినిమా విషయంలో ఆయన ఎంతో నిబద్ధతతో వ్యవహరించేవారు. పనిపట్ల ఆయనకు ఉన్న అంకితభావానికి దర్శక-నిర్మాతలే కాదు, తోటి నటీనటులు సైతం ఆశ్చర్యపోయేవారు. అందుకే ఆయన సెట్‌లో ఉన్నారంటే అంతా భయంతో వణికిపోయేవారు. జానపదం, పౌరాణికం, సాంఘికం ఇలా జోనర్‌ ఏదైనా ఆ పాత్రల్లో ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు. ఇక ఏదైనా కొత్త పాత్ర చేయాలని సంకల్పిస్తే అస్సలు వెనకడుగు వేయరు. అలాంటిదే ఈ సంఘటన.

ఎన్టీఆర్‌ శ్రీనాథుడి కథను చిత్రంగా తియ్యాలనుకున్నారు. ఇదే విషయాన్ని బాపు-రమణల దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్లు ‘‘శ్రీనాథుడి జీవితంలో పెద్ద కథేం ఉండదు. సామాన్యులకి ఆయన ఎవరో తెలియదు. అది సినిమా తియ్యడం అంటే, ఇబ్బందే! ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందేమో!’’ అని అన్నారు. ‘‘ఏం పర్వాలేదు. నష్టం వచ్చినా నాకు ఇబ్బందిలేదు. మనం నిష్ఠగా కచ్చితమైన శ్రద్ధతో సినిమా తీద్దాం. ప్రజాదరణ పొందకపోయినా ఇబ్బంది లేదు. కొందరైనా ఆ సినిమా చూస్తారు. ఆ తృప్తిచాలు. ఏమైనా, శ్రీనాథుడి పాత్ర ధరించాలనేది నా కోరిక. అంతే’’ అని అన్నారట ఎన్‌.టి.ఆర్‌. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో ఎన్టీఆర్‌, జయసుధ జంటగా ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’ తెరకెక్కింది. కేవీ మహదేవన్‌ బాణీలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని