RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ ఆనందం

భారతీయ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్‌ఆర్‌ఆర్‌ అంతర్జాతీయంగా ఇంకా ఆకట్టుకుంటూనే ఉంది. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో ఒక థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌కి ప్రేక్షకులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు.

Updated : 04 Oct 2022 11:58 IST

భారతీయ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) అంతర్జాతీయంగా ఇంకా ఆకట్టుకుంటూనే ఉంది. అమెరికాలోని లాస్‌ఏంజెలెస్‌లో ఒక థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌కి ప్రేక్షకులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. అంతర్జాలంలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ స్పందనని చూసి మురిసిపోయారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. తనపట్ల, తన హీరోలపట్ల చూపించిన ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడి ప్రదర్శనకి సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. అది చూసి కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ స్పందించారు. ‘ఈ ప్రశంసలకు మీరు అర్హులు. ఇవే కావు.. మీకు ఇంకా ఎంతో రావాల్సి ఉంది జక్కన్నా’ అంటూ సోమవారం ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని