NTR: ఈ విషయం ప్రపంచానికి తెలియదు: తారక్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జాతర షురూ అయ్యింది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా...

Published : 17 Mar 2022 12:25 IST

స్పెషల్‌ చిట్‌చాట్‌లో ఎన్టీఆర్‌ మెరుపులు

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి షురూ అయ్యింది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ని దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. సుమారు 30నిమిషాలపాటు సాగిన ఈ చిట్‌చాట్‌లో రాజమౌళి, తారక్‌, చరణ్‌ పాల్గొని.. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇంటర్వ్యూ మొత్తం ఒకెత్తు అయితే.. అందులో తారక్‌ చెప్పిన విషయాలు, ఆయన కామెడీ టైమింగ్‌ మరో లెవల్‌లో ఉంది. దీంతో ఈ ఇంటర్వ్యూలో తారక్‌ మాట్లాడిన కొన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఇంతకీ అవేంటంటే..!

చరణ్‌తో తనకున్న అనుబంధంపై స్పందిస్తూ.. ‘‘చరణ్‌కు నాకూ మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహబంధం ఉంది. మేమిద్దరం ఈ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. గుండెల్లో అగ్నిపర్వతం రగిలిపోతున్నా చరణ్‌ పైకి మాత్రం సైలెంట్‌గా ఉంటాడు. అది నాకు బాగా నచ్చింది. ఈ ప్రపంచానికి తెలియని మరో విషయం ఏమిటంటే.. నా సతీమణి ప్రణతీ పుట్టినరోజు మార్చి 26. చరణ్‌ బర్త్‌డే 27. ప్రణతీ పుట్టినరోజు నాడు అర్ధరాత్రి 12 గంటలు కాగానే.. నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసి.. గేటు ముందు నిల్చొవడం, చరణ్‌ కారు రావడం, మేమిద్దరం బయటకు వెళ్లడం.. క్షణాల్లో జరిగిపోతుంది’’ అంటూ తారక్‌ తెలిపారు. అనంతరం రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్‌గా నన్ను విమర్శించే వ్యక్తులు ఇద్దరే. ఒకరు మా నాన్న హరికృష్ణ గారు. మరొకరు రాజమౌళి. ఈ రోజు నటుడిగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం రాజమౌళినే’’ అని చెప్పారు. ఇవి మాత్రమే కాకుండా సెట్‌లో రాజమౌళి ఎలా ఉంటారో అనుకరించి చూపించారు, వల్లి, రమా రాజమౌళి, కార్తికేయలతో తన సంభాషణలు ఎలా ఉంటాయో తారక్‌ ఫన్నీగా చూపించారు. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియోలను మీరూ చూసేయండి..!






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని