RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గ్రాండ్‌ సీన్‌.. ఎలా తీశారో తెలుసా..!

ఎన్టీఆర్ ‌(NTR) - రామ్‌చరణ్‌ (Ram Charan) ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి (Rajamouli) రూపొందించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌...

Updated : 27 Aug 2022 12:02 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్ ‌(NTR) - రామ్‌చరణ్‌ (Ram Charan) ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి (Rajamouli) రూపొందించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు ‘వావ్‌’ అనిపించేలా గ్రాండ్ లెవల్‌లో ఉంటాయి. హీరోలిద్దరి పరిచయ సన్నివేశాలు.. అందులోనూ తారక్‌ ఎంట్రీ సీన్‌ అయితే చెప్పడానికి మాటలు సరిపోవు.

పెద్దపులితో భీకర పోరాటం చేస్తూ ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇస్తుంటే.. థియేటర్‌లో ఫుల్‌ సౌండ్‌లో ఆ సీన్‌ చూసిన ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు. కాగా, ఈ సీన్‌ని ఎలా చిత్రీకరించారో తెలియజేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తాజాగా మేకింగ్‌ వీడియో షేర్‌ చేసింది. నిమిషం నిడివి గల ఈ వీడియోలో మొదట సినిమా సీన్‌ని చూపించి.. తర్వాత దాన్ని ఎలా తీర్చిదిద్దారో తెలియజేశారు. తారక్‌పై దాడి చేసేందుకు పులి ఎలా ముందుకు ఉరుకుతుంది? పంజా విసిరేందుకు ఏవిధంగా ప్రయత్నిస్తుంది? ఇలా ప్రతి విషయాన్ని జక్కన్న క్షుణ్ణంగా తెలియజేస్తూ కనిపించారు. ప్రస్తుతం వీడియో మూవీ లవర్స్‌ని బాగా ఆకర్షిస్తోంది.

ఇక, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయానికి వస్తే సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రామ్‌చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా మెప్పించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జీ 5, నెట్‌ఫ్లిక్స్‌ వేదికలుగా అందుబాటులో ఉంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని