NTR: రీ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న తారక్‌ బ్లాక్‌బాస్టర్‌ సినిమా

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ (NTR) హీరోగా నటించిన సినిమా ‘సింహాద్రి’ (Simhadri). తారక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్‌ చేయనున్నారు. 

Published : 31 Mar 2023 12:40 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌లు కొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది హీరోల సినిమాలు రీ రిలీజ్‌లతో రికార్డు సృష్టించాయి. రిలీజ్‌ సమయంలో మెప్పించలేకపోయిన సినిమాలు కూడా రీ రిలీజ్‌లో భారీ వసూళ్లు సాధిస్తున్నాయంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. ఇక మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్‌ సూపర్‌ హిట్‌ సినిమా ప్రేక్షకులకు హై క్వాలిటీలో కిక్‌ ఇవ్వడానికి సిద్ధమైంది. ఎన్టీఆర్‌, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహాద్రి’ (Simhadri)ని త్వరలోనే రీ రిలీజ్‌చేయనున్నారనే వార్తతో తారక్‌ అభిమానులు సంబర పడుతున్నారు.

2003లో విడుదలైన ‘సింహాద్రి’ సినిమా అప్పట్లో సెన్సెషన్‌ క్రియేట్‌ చేసింది. భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్‌ను క్రియేట్‌ చేయడానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను మే 20న 4కే వర్షన్‌లో రీ రిలీజ్‌ చేయనున్నారు. ఎన్టీఆర్‌ సరసన భూమిక చావ్లా, అంకిత హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాధ్‌ కథ అందించగా.. కీరవాణి సంగీతం అందించారు. ఇక ఈ సినిమా అంత హిట్‌ అవ్వడానికి ఇందులోని పాటలు కూడా ఓ కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని