Published : 21 Jan 2022 01:41 IST

ఖమ్మంలో శ్రీకృష్ణావతారంలో ఎన్టీఆర్ విగ్రహం..ఆవిష్కరణకు జూనియర్‌!

ఖమ్మం: ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 100 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో కృష్ణుడి రూపంలో ఉన్న ప్రతిమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మే 28న ఎన్టీఆర్‌ 100వ జయంతి సందర్భంగా ఆయన మనవడు జూనియర్‌ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు.

ఎన్టీఆర్‌ విగ్రహం ఇలా..

బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​పై అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాంకేతికతను జోడించి నిజామాబాద్‌కు చెందిన వర్మ అనే చిత్రకారుడు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. మాయాబజార్, శ్రీకృష్ణ తులాభారం, దానవీరశూరకర్ణ లాంటి సినిమాలలో కృష్ణుని వేషధారణలో వెండితెర ఇలవేల్పుగా అవతరించిన ఎన్టీఆర్‌ను చూపాలన్న తపనతో నిర్వహకులు శ్రమిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని