NTR:ఎన్టీఆర్‌కు వెట్రిమారన్ కథ వినిపించారా?
‘ఆర్ఆర్ఆర్’(RRR)తో ఫుల్ జోష్‌లో ఉన్నారు స్టార్ హీరో ఎన్టీఆర్(NTR). త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్: ‘ఆర్ఆర్ఆర్’(RRR)తో ఫుల్ జోష్‌లో ఉన్నారు స్టార్ హీరో ఎన్టీఆర్(NTR). త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం స్పెషల్ మేకోవర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. వాస్తవికతకు దగ్గరగా సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు తమిళ దర్శకుడు వెట్రిమారన్(Vetrimaaran). ‘విచారణై’, ‘వడచెన్నై’, ‘అసురన్’ చిత్రాలే అందుకు ఉదాహరణ. అలాంటి రియలిస్టిక్ మాస్ డైరెక్టర్ ఎన్టీఆర్‌ను కలిశారట. అంతేకాదు, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా పాన్ ఇండియా స్థాయిలో ఓ కథను వినిపించారని సమాచారం. వెట్రిమారన్ చెప్పిన కథ విన్న ఎన్టీఆర్ ఇంకా తన స్పందన తెలియజేయలేదట. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం తారక్ చేతిలో కొరటాల శివ సినిమా ఉంది. దీని తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తారు. ఈ క్రమంలో వెట్రిమారన్ కథ చెప్పడం గమనార్హం. ఈ సినిమా చేయాలంటే మొదటి రెండు ప్రాజెక్టులు పూర్తవ్వాలి. మరోవైపు సూర్య కథానాయకుడిగా వెట్రిమారన్ ‘వాడివాసల్’ తెరకెక్కిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే