NTR: ‘బింబిసార’ రిలీజ్‌.. ఎన్టీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

‘బింబిసార’(Bimbisara) రాజు పాత్రకు తన సోదరుడు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) తప్ప మరెవరూ సరైన న్యాయం చేయలేరని నటుడు ఎన్టీఆర్‌ (NTR) అభిప్రాయం వ్యక్తం చేశారు....

Published : 05 Aug 2022 15:21 IST

హైదరాబాద్‌: ‘బింబిసార’(Bimbisara) రాజు పాత్రకు తన సోదరుడు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) తప్ప మరెవరూ సరైన న్యాయం చేయలేరని నటుడు ఎన్టీఆర్‌ (NTR) అన్నారు. ప్రేక్షకుల నుంచి ‘బింబిసార’కు వస్తోన్న స్పందనపై తాజాగా తారక్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాని తొలిసారి చూసినప్పుడు తామెలాంటి అనుభూతిని పొందామో.. ప్రేక్షకులూ అదే ఆనందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. ‘‘బింబిసార’ సినిమా గురించి గొప్ప విషయాలు వింటున్నా. కల్యాణ్‌ రామ్ అన్నా.. ఈ సినిమాలో రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు. వశిష్ఠ.. తొలి ప్రయత్నంలోనే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించావు. ఇక, ఈచిత్రానికి కీరవాణి గారే వెన్నెముక. ఆయన అందించిన స్వరాలు అద్భుతంగా ఉన్నాయి’’ అని చిత్రబృందం మొత్తానికి ఎన్టీఆర్‌ అభినందనలు తెలిపారు. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. ఇందులో కల్యాణ్‌రామ్‌ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించారు. సంయుక్తా మేనన్‌, కేథరిన్‌ కథానాయికలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని