Published : 20 May 2022 18:00 IST

NTR: అందుకే మిమ్మల్ని కలవలేకపోయా.. అభిమానులకు ఎన్టీఆర్‌ లేఖ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన పుట్టినరోజు సందర్భంగా ఇంటి దగ్గరకు వచ్చిన అభిమానులను కలవలేకపోయినందుకు ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ (NTR) క్షమాపణలు కోరారు. తాను ఇంట్లో లేనందువల్లే వారిని కలుసుకోలేకపోయానంటూ ఓ లేఖ రాశారు. ‘‘క్షమించండి. నేను ఇంట్లో లేకపోవడం వల్ల మిమ్మల్ని కలుసుకోలేకపోయా. మీ ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలకు కృతజ్ఞుడిని. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమలోని సహనటులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

శుక్రవారం.. ఎన్టీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని స్వయంగా శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ‘జై ఎన్టీఆర్‌.. జై జై ఎన్టీఆర్‌’, ‘హ్యాపీ బర్త్‌డే తారక్‌ అన్నా’ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై టపాసులు కాల్చి, కేకులు కట్‌ చేసి.. సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, #NTR30 , #NTR31 అప్‌డేట్స్‌ రావడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని