Nupur Sanon: పండగకు శ్రీకారం

రవితేజ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ  దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 2న లాంఛనంగా ప్రారంభం కానుంది. అంతేకాదు అదే రోజు మధ్యాహ్ననం 12.06గంటలకు ఈ చిత్ర ప్రీలుక్‌ను విడుదల చేయనున్నారు.

Updated : 01 Apr 2022 14:12 IST

రవితేజ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. వంశీ  దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 2న లాంఛనంగా ప్రారంభం కానుంది. అంతేకాదు అదే రోజు మధ్యాహ్ననం 12.06గంటలకు ఈ చిత్ర ప్రీలుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాల్ని చిత్ర బృందం గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ‘‘1970వ దశకంలో దక్షిణ భారతదేశంలో ఎంతో పేరుమోసిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందుతోంది. ఈ సినిమాలో రవితేజ పూర్తి భిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్‌, సంభాషణలు పలికే తీరు కొత్తగా ఉంటాయి. ఈ పాత్ర కోసం    తన శరీరాకృతిని మార్చుకోనున్నారు రవితేజ.’’ అని సినీవర్గాలు తెలిపాయి. సంగీతం: జివి ప్రకాష్‌, మాటలు: శ్రీకాంత్‌ విస్సా, కళ: అవినాష్‌ కొల్లా, ఛాయాగ్రహణం: ఆర్‌ మదీ.


‘టైగర్‌..’కు జోడీగా..

‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రం కోసం రవితేజకు జోడీగా నూపూర్‌ సనన్‌ను ఎంపిక చేసింది చిత్ర బృందం. ఈ విషయాన్ని గురువారమే అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్‌ నాయిక కృతి సనన్‌ సోదరే నూపూర్‌. ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌తో కలిసి ఓ మ్యూజిక్‌
వీడియోలో కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు రవితేజ సినిమాతో నాయికగా వెండితెరపైకి అడుగు పెట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని