‘నూటొక్క జిల్లాల అందగాడు’ అందరినీ నవ్విస్తాడు!

‘స్ర్కిప్ట్‌ రాయడం మొదలుపెట్టినప్పుడు ఇది నా ఆలోచన మాత్రమే అనుకున్నా. డైరెక్టర్‌ క్రిష్‌కి చెప్పినప్పుడు ఇది మా కథ అయింది. నా దగ్గర మొదలైన ఓ ఆలోచన ఆ తర్వాత చిత్రబృందంలోని అందరి సినిమా అయింది. ....

Updated : 30 Aug 2022 15:58 IST

హైదరాబాద్‌: విభిన్నమైన కథలతో దర్శకుడిగానూ ఆకట్టుకున్న  నటుడు శ్రీనివాస్‌ అవసరాల.  ఇప్పుడు మరోసారి వైవిధ్యమైన కథాంశంతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.  బట్టతల చుట్టూ తిరిగే విభిన్నమైన కథతో తెరకెక్కిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’లో ఆయన హీరోగా చేస్తున్నారు.  రుహాని శర్మ కథానాయిక. రాచకొండ విద్యాసాగర్‌ రావు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై దిల్‌రాజ్‌, క్రిష్‌ సమర్పణలో శిరీష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 3న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌  వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

 ఈ సందర్భంగా శ్రీనివాస్‌ అవసరాల మాట్లాడుతూ..‘స్ర్కిప్ట్‌ రాయడం మొదలుపెట్టినప్పుడు ఇది నా ఆలోచన మాత్రమే అనుకున్నా. డైరెక్టర్‌ క్రిష్‌కి చెప్పినప్పుడు ఇది మా కథ అయింది. నా దగ్గర మొదలైన ఓ ఆలోచన ఆ తర్వాత చిత్రబృందంలోని అందరి సినిమా అయింది. అలా ఈ చిత్రం కోసం పనిచేసినవాళ్లంతా తమ సినిమాలా భావించి చేశారు. సెప్టెంబర్‌ 3న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది’ అని  తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమా ఆలోచన ‘కంచె’ చిత్రీకరణ సమయంలోనే పుట్టిందని ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్‌ క్రిష్‌ చెప్పారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతాన్ని అందించగా, రామ్‌ సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని