Oscar 2023: ఆస్కార్‌కు నామినేట్ అయిన గుజరాతీ చిత్రం
ఆస్కార్- 2023లో పోటీ పడే అవకాశం గుజరాతీ సినిమాకు దక్కింది. ఆస్కార్‌కు నామినేట్ అయినట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Film Federation of India) ప్రకటించిన ఆ చిత్రం ఏదంటే?
ఇంటర్నెట్ డెస్క్: ఆస్కార్- 2023 (Oscar 2023)లో పోటీ పడే అవకాశం గుజరాతీ సినిమా ‘ఛల్లో షో’ (Chhello Show)కు దక్కింది. ఈ చిత్రం ఆస్కార్‌కు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయినట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Film Federation of India) ప్రకటించింది. ఈ ప్రకటనపై ‘ఛల్లో షో’ చిత్ర దర్శకుడు నలిన్ పాన్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్ ఎంట్రీకి తమ చిత్రం నామినేట్ చేసినందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ ఏడాది భారత్ నుంచి ఎంపికయ్యే అవకాశం ఉన్న చిత్రమంటూ ‘ఆర్ఆర్ఆర్’ పేరు ప్రముఖంగా వినిపించింది. పలు ఇంగ్లీష్ మ్యాగజైన్స్ సైతం ఫలానా కేటగిరీల్లో ‘ఆర్ఆర్ఆర్’ పోటీ పడే ఛాన్స్ ఉందని రాసుకొచ్చాయి. ప్రస్తుతం ఆ అవకాశం లేనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర విభాగాల అవార్డులకు ఎంపికైన సినిమాల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇదీ కథ..: ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో ఆస్కార్‌కు ఎంపికైన ఈ సినిమా దర్శకుడు నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కింది. చిన్న తనంలో ఆయన సినిమాలకు ఎలా ఆకర్షితులయ్యారు? వెండితెర, సినిమా పై ఎంత మమకారం పెంచుకున్నారు? తదితర హృదయాలను హత్తుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. గుజరాత్ రాష్ట్రంలోని గ్రామీణ వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో ఈ సినిమా ద్వారా నలిన్ కళ్లకు కట్టినట్టు చూపించారు. తొమ్మిదేళ్ల బాలుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేశ్ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్ రావల్, పరేశ్ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. ‘లాస్ట్ ఫిల్మ్ షో’ (ఆంగ్లంలో) (Last Film Show) పేరుతో ఈ సినిమా గతేడాది జూన్‌లో ‘ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శితమై, వీక్షకుల హృదయాల్ని బరువెక్కించింది. పలు అంతర్జాతీయ వేడుకల్లోనూ సత్తా చాటింది. అక్టోబరు 14న భారత్‌లో విడుదలకాబోతుంది.
ఆస్కార్ పోటీలో నిలిచిన మన చిత్రాలు..
* మదర్ ఇండియా (1958)
* సలామ్ బాంబే (1989)
* లగాన్ (2001)
ఇప్పటి వరకూ ఈ మూడు భారతీయ సినిమాలు ఆయా ఏడాదిలో ఆస్కార్ అవార్డుల్లో గట్టి పోటీనిచ్చి, తుది జాబితాలో నిలిచాయి. తమిళ చిత్రం ‘కూలంగళ్’ (పెబెల్స్) గతేడాది ఆస్కార్‌కు నామినేట్ అయినా షార్ట్‌లిస్ట్‌లో నిలవలేకపోయింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో మార్చి 12న వచ్చే ఏడాది జరగనుంది.
జనరల్ కేటగిరీలో...
ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ కాని, చిత్రాలు జనరల్ కేటగిరిలో పోటీ చేయొచ్చు. దాని కోసం ఆయా చిత్ర బృందాలు తమ సినిమా నామినేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ అక్టోబరు 3 వరకూ అవకాశం ఉంది. 2022లో విడుదలైన ((జనవరి 1 నుంచి నవంబరు 30 వరకు) చిత్రాలకు వెసులుబాటు ఉంది. ఆయా సినిమాలు థియేటర్లలో కనీసం ఏడు రోజులు ప్రదర్శితమై ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్‌తో కృతి సనన్
సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్‌లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ