Vaani kapoor: క్రైమ్ థ్రిల్లర్ కథలో వాణీకపూర్
వాణీ కపూర్ ప్రధాన పాత్రధారిగా.. ‘మర్దానీ 2’ దర్శకుడు గోపీ పుత్రన్ ఓ సినిమా తెరకెక్కించనున్నారని గతంలో వార్తలొచ్చాయి.
వాణీ కపూర్ (Vaani Kapoor) ప్రధాన పాత్రధారిగా.. ‘మర్దానీ 2’ (Mardaani 2) దర్శకుడు గోపీ పుత్రన్ ఓ సినిమా తెరకెక్కించనున్నారని గతంలో వార్తలొచ్చాయి. అప్పట్లో దీనిపై ఎవరూ స్పందించలేదు. తాజాగా ఈ వార్త నిజమేనంటూ చిత్రబృందం మంగళవారం ప్రకటించింది. క్రైం థ్రిల్లర్ కథాంశంతో ఇది పట్టాలెక్కనుంది. ‘కథ, స్క్రిప్ట్ వినగానే వాణీ కపూర్ ఉత్సుకతకి గురయ్యారు. వెంటనే ఈ ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్చిలో లఖ్‌నవూలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అని సినీవర్గాలు తెలిపాయి. దీన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్