Major: ‘మేజర్‌’ ప్రేమగీతం ఫుల్‌ వీడియో.. అలరిస్తోన్న అడివి శేష్‌- సయీ జోడీ

26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ టైటిల్‌ పాత్ర పోషించగా సయీ మంజ్రేకర్‌, శోభిత, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Published : 18 May 2022 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్‌’. అడివి శేష్‌ టైటిల్‌ పాత్ర పోషించగా సయీ మంజ్రేకర్‌, శోభిత, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ‘ఓహ్‌ ఇషా’ అనే గీతాన్ని విడుదల చేసింది. మేజర్‌ సందీప్‌ ప్రేమ కథను ఆవిష్కరిస్తూ సాగే గీతమిది. శేష్‌, సయీ రొమాంటిక్‌ లుక్‌లో కనిపించి, అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. రాజీవ్‌ భరద్వాజ్‌ రచించిన ఈ పాటను అర్మాన్‌ మాలిక్‌, చిన్నయి శ్రీపాద ఆలపించారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందించారు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్స్‌, ఏ ప్లస్‌ ఎస్‌, సోనీ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని