Sita Ramam: కథను మలుపు తిప్పిన పాట.. వీడియో చూశారా..!

దుల్కర్‌ సల్మాన్‌ - మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన..

Published : 01 Sep 2022 13:25 IST

హైదరాబాద్‌: దుల్కర్‌ సల్మాన్‌ - మృణాల్‌ ఠాకూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకుడు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టి సూపర్‌హిట్టైంది. ఈ నేపథ్యంలో ‘సీతారామం’ నుంచి వీడియో సాంగ్స్‌ని చిత్రబృందం ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. గురువారం ఉదయం తాజాగా ‘హే సీతా.. వదలనిక తోడవుతా’ పాట పూర్తి వీడియో షేర్‌ చేసింది. ఎస్పీ చరణ్‌ - రమ్య బెహరా ఆలపించిన ఈ పాట ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే.

ఈ పాటతోనే సినిమా ఒక మలుపు తీసుకొంటుంది. అప్పటి వరకూ తన ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతోన్న హీరోయిన్‌కు ఇందులో జరిగే ఓ సంఘటన సాయపడుతుంది. ఇక సినిమా విషయానికి వస్తే వైజయంతీ మూవీస్‌ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక ముఖ్య భూమిక పోషించారు. సుమంత్‌, తరుణ్‌ భాస్కర్‌, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పటి వరకూ దక్షిణాదిలో అలరించిన ఈ సినిమా శుక్రవారం నుంచి హిందీ వారికీ చేరువ కానుంది. ఈ మేరకు గురువారం ‘సీతారామం’ హిందీ ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని