‘ఓ మాదిరిగా’ అంటూ మరొక హిట్‌సాంగ్‌తో..

సిందూరం చిత్రంలోని ‘ఓ మాదిరిగా’ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు పరుశురామ్‌ విడుదల చేశారు.

Updated : 08 Dec 2022 17:36 IST

హైదరాబాద్‌: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సిందూరం’లోని మొదటి పాట(ఆనందమో ఆవేశమో) ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. తక్కువ సమయంలో అందరి ఆదరణ పొందడమే కాకుండా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ తెలుగులో మొదటి పాటతో పాటు రెండో పాటను కూడా రిలీజ్ చేశారు.

‘ఓ మాదిరిగా’ అంటూ సాగే ఈ పాటను దర్శకుడు పరుశురామ్‌ విడుదల చేశారు. పాట చాలా బాగుందని, హరి సంగీతం ఫ్రెష్ ఫీల్ ఇచ్చిందన్నారు. సత్య ప్రకాష్, హరిణి చాలా బాగా పాడారని, బాలాజీ గారి సాహిత్యం చక్కగా ఉందన్న ఆయన, లీడ్ పెయిర్ బాగా యాక్ట్ చేశారని కొనియాడారు. మొదటి పాటకు వచ్చినట్టే ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి, ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి జంగా టీమ్ అంతా ఆశిస్తున్నారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని