Oke Oka Jeevitham: ఒకే ఒక జీవితం ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ అక్కడే..!

‘తనని నిత్యం నడిపే సారథిని కలవడానికి టైం ట్రావెల్ చేయనున్న ఆది.. తన ప్రయాణంలో మీరు భాగం అవ్వండి సోనీ LIV ద్వారా..’

Published : 15 Oct 2022 18:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌ (Sharwanand) హీరోగా టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కి, మంచి విజయం అందుకున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham). ఇప్పుడు ఈ సినిమా ‘సోనీ లివ్‌’ (Sony Liv)ఓటీటీలో అక్టోబరు 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ‘తనని నిత్యం నడిపే సారథిని కలవడానికి టైం ట్రావెల్ చేయనున్న ఆది.. తన ప్రయాణంలో మీరు భాగం అవ్వండి సోనీ LIV ద్వారా..’ అంటూ సదరు సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొంది. అమల అక్కినేని కీలక పాత్రధారిగా నటించిన ఈ సినిమా సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా శ్రీ కార్తిక్‌ మెప్పించారు.

క‌థేంటంటే: ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) మంచి స్నేహితులు. చిన్నప్పట్నుంచీ క‌లిసి పెరిగిన వీళ్లు ఒకొక్కరూ ఒక్కో స‌మ‌స్యతో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు. ఎవ‌రిలోనూ సంతృప్తి ఉండదు. ఈ ముగ్గురికీ పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. అతడు ఇర‌వ‌య్యేళ్లుగా టైమ్ మెషిన్‌ క‌నిపెట్టడం కోసం కష్టప‌డుతుంటాడు. చివ‌రికి తాను క‌నిపెట్టిన టైమ్ మెషిన్‌తో గ‌తంలోకి వెళ్లి త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. మ‌రి వాళ్లు గ‌తంలోకి వెళ్లి ఏం చేశారు? త‌ప్పుల్ని స‌రిదిద్దుకున్నారా ? భ‌విష్యత్తుని గొప్పగా మార్చుకున్నారా? విధి వారికి ఏం చెప్పింద‌నేది మిగ‌తా క‌థ‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని