Om Movie: ఒకటి కాదు.. రెండు కాదు.. 550 సార్లు రీరిలీజ్ అయిన ఏకైక మూవీ!
Om Movie: శివరాజ్‌కుమార్ కథానాయకుడిగా ఉపేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓం’ అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన సినిమాగా రికార్డు సృష్టించింది.
ఇంటర్నెట్‌డెస్క్: ఒకప్పుడు ఏదైనా పండగ లేదా హీరోల పుట్టినరోజు సందర్భంగా వాళ్లు నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలను రీ-రిలీజ్ చేసేవారు. ఇటీవల ఆ ట్రెండ్ మళ్లీ మొదలైంది. పాత సినిమాలకు కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. మామూలుగా ఒక సినిమాను ఎన్నిసార్లు రీ-రిలీజ్ చేస్తారు? ఒకట్రెండుసార్లు. మహా అయితే మూడోసారి. కానీ, ఒక సినిమాను ఏకంగా 550 సార్లు రీరిలీజ్ చేశారంటే నమ్ముతారా? అవును మీరు విన్నది నిజమే. అదే కన్నడ మూవీ ‘ఓం’ (Om). ఉపేంద్ర (Upedra) దర్శకత్వంలో శివరాజ్‌కుమార్ (Shiva Rajkumar) కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రేమ (Prema) కథానాయిక. 1995 మే 19న (ఈ మే 19కు 28ఏళ్లు పూర్తి) విడుదలైన ఈ చిత్రం కన్నడనాట సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి (మార్చి 12, 2015 వరకూ) ఏకంగా 550 సార్లు రీ-రిలీజ్ చేశారు. అత్యధికసార్లు రీరిలీజ్ అయిన భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించింది.
‘ఓం’ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు..
- దర్శకుడు ఉపేంద్ర కాలేజ్ చదువుకునే రోజుల్లోనే ఈ కథను రాసుకున్నారు. ఎవరో రాసిన లెటర్‌ను తన స్నేహితుడు పురుషోత్తం తీసుకురావడంతో కాలేజ్ మొత్తం హాట్‌టాపిక్ అయిందట. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని ‘ఓం’ కథలో ఫస్ట్ పార్ట్ రాసుకున్నారు.
- ద్వితీయార్ధానికి వచ్చే సరికి ఆర్గనైజ్డ్ క్రైమ్, మాఫియా బ్యాక్‌డ్రాప్ నుంచి నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథను రాసుకుంటే, అప్పటికే విడుదలైన రాంగోపాల్‌వర్మ-నాగార్జున ‘శివ’ కథకు దగ్గర పోలికలు ఉండటంతో కాస్త నిరాశ చెందారట. ఆ తర్వాత కొన్ని మార్పులతో ప్రస్తుతం ఉన్న కథను రాసుకున్నారు.
- అండర్‌వరల్డ్‌లో పనిచేసిన అనేక మంది నేరస్థులు/నిందితులు ‘ఓం’ సినిమాలో నటించారు. కేవలం ఈ సినిమా కోసమే కొందరిని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చారు. అంతేకాదు, అప్పట్లో పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్‌లో ఉన్న కృష్ణప్ప, బెక్కిన కన్ను రాజేంద్ర, కోరంగు, తన్వీర్ వంటి వారు కూడా నటించారు.
- సినిమా విడుదలకు ముందే కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ‘ది వీక్’ మ్యాగజైన్ ‘ఓం’పై ఏకంగా కవర్ స్టోరీనే ప్రచురించింది. లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ బ్యానర్‌పై ఇలాంటి సినిమాను నిర్మించకుండా ఉండాల్సిందని రాసుకొచ్చింది.
- తొలుత తీసిన ‘ఓం’ మూవీ క్లైమాక్స్ వెర్షన్‌పై సెన్సార్‌బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. మార్పులు చేస్తేనే ధ్రువీకరణ పత్రం ఇస్తామని చెప్పడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేశారు.
- ‘ఓం’ సినిమా బడ్జెట్ సుమారు రూ.70లక్షలు. హెచ్‌డీ కుమారస్వామి పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. 1995 మే 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
- 1996 కర్ణాటక స్టేట్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా శివరాజ్‌కుమార్, నటిగా ప్రేమ, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఉపేంద్ర, సినిమాటోగ్రాఫర్‌గా బీసీ గౌరీ శంకర్‌లు అవార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్(సౌత్)ను శివరాజ్‌కుమార్ సొంతం చేసుకున్నారు.
- బెంగళూరులోని కపిల్ థియేటర్‌లో ‘ఓం’చిత్రాన్ని అత్యధికంగా 30సార్లు రీ-రిలీజ్ చేశారు. అదొక రికార్డు.
- సినిమా విడుదలైన 20ఏళ్ల తర్వాత అంటే 2015లో ‘ఓం’ డిజిటల్ రైట్స్ విక్రయానికి పెట్టగా రూ.10కోట్లకు ఉదయ్ టీవీ కొనుగోలు చేసింది.
- తెలుగులోనూ ‘ఓంకారమ్’ పేరుతోనే రాజశేఖర్ కథానాయకుడిగా దీన్ని రీమేక్ చేశారు. అలాగే ‘అర్జున్‌పండిట్’ పేరుతో సన్నీ దేఓల్, జుహీచావ్లా కీలక పాత్రల్లో హిందీలో రీమేక్ అయింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి
-
Movies News
Sharwanand: సందడిగా శర్వానంద్ పెళ్లి వేడుకలు.. వీడియో వైరల్
-
India News
Wrestlers: రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందే.. కానీ,.. : అనురాగ్ ఠాకూర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సుప్రీంకోర్టు ధర్మాసనం