Adipurush: సైఫ్ లుక్ కాంట్రవర్సీ.. ఓం రౌత్ క్లారిటీ
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈసినిమా టీజర్ అంతటా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇందులోని పాత్ర లుక్స్‌పై పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా దర్శకుడు ఓం రౌత్ స్పందించారు.
ముంబయి: సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా టీజర్‌పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రావణాసురుడి పాత్రధారి అయిన సైఫ్ అలీఖాన్ లుక్‌పై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో వచ్చిన ‘రామాయణం’ సీరియల్లోని రావణాసురుడి లుక్‌ని ‘ఆదిపురుష్’లోని లుక్‌తో పోల్చుతూ పలువురు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. దీనిపై తాజాగా డైరెక్టర్ ఓం రౌత్ స్పందించారు.
‘‘రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి. లుక్స్‌తోనే ఆయన క్రూరత్వాన్ని చూపించాలి. గతంలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణం’లో పొడవాటి జుత్తు, గంభీరమైన చూపులు, భారీ ఆకారంలో రావణాసురుడిని చూపించారు. ఆనాటి రోజుల్లో క్రూరత్వాన్ని ఆ విధంగా తెలియజేశారు. కానీ, ఇప్పటితరం, భవిష్యత్తు తరాల వారికీ ఈ సినిమా చేరాలని అనుకుంటున్నా. ఈ సినిమాతో రాముడి గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజెప్పాలనుకుంటున్నా. అందుకు అనుగుణంగానే రావణాసురుడి లుక్‌ని అలా డిజైన్ చేశాం. రావణాసురుడు ఒక భయంకరమైన పక్షిపై ప్రయాణిస్తున్నట్లు టీజర్లో చూపించాం. అయితే, దాన్ని కూడా అందరూ తప్పుపడుతున్నారు. కేవలం 95 సెకన్ల వీడియో చూసి ఒక అభిప్రాయానికి రావొద్దు. సినిమా చూశాక మాట్లాడండి. ఇక సినిమాలో హనుమంతుడికి లెదర్ దుస్తులు వేశామని అందరూ విమర్శిస్తున్నారు. నిజం చెప్పాలంటే మేము ఎలాంటి లెదర్ దుస్తులు ఉపయోగించలేదు’’ అని ఓంరౌత్ వివరణ ఇచ్చారు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సిద్ధమైన ఈ సినిమాలో కృతిసనన్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?