Adipurush: ‘ఆదిపురుష్‌’.. రాముడిగా ప్రభాస్‌.. ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ముఖ్యంగా ప్రభాస్‌ (Prabhas) అభిమానులకు దర్శకుడు ఓంరౌత్ (OmRaut) స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు...

Updated : 30 Sep 2022 07:46 IST

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ముఖ్యంగా ప్రభాస్‌ (Prabhas) అభిమానులకు దర్శకుడు ఓంరౌత్ (OmRaut) స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రభాస్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న ‘ఆదిపురుష్‌’ (Adipurush) ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని శుక్రవారం ఉదయం షేర్‌ చేశాడు. ఇందులో ప్రభాస్‌ పొడవాటి జుత్తు, చేతికి రుద్రాక్షలు ధరించి రాముడిగా.. ఆకాశానికి విల్లు ఎక్కుపెట్టి పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించారు. ‘‘మా ఈ అద్భుతమైన ప్రయాణంలో మీరూ భాగం కండి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం.. అయోధ్యలోని సరయు నది ఒడ్డున జరగనున్న ‘ఆదిపురుష్‌’ టీజర్‌ లాంచ్‌లో పాల్గొనండి. అక్టోబర్‌ 2న రాత్రి 7.11 గంటలకు టీజర్‌ విడుదల చేయనున్నాం’’ అని ఔంరౌత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ అంతటా వైరల్‌గా మారింది.

రామాయణాన్ని ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండగా ఆయనకు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ మెరవనున్నారు. లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ కనిపించనున్నారు. రామాయణంలో ముఖ్యంగా చెప్పుకొనే రావణాసురుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు