samantha: ఆ యూట్యూబ్‌ ఛానెళ్లపై చర్యలు తీసుకోండి: సమంత తరపు న్యాయవాది

సినీ నటి సమంత వేసిన పరువునష్టం దావా కేసు విచారణ హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని న్యాయస్థానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే

Updated : 25 Oct 2021 18:20 IST

హైదరాబాద్‌: సినీ నటి సమంత వేసిన పరువునష్టం దావా కేసు విచారణ హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని న్యాయస్థానంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తన క్లయింట్‌ పరువుకు నష్టం కలిగించేలా, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు వ్యవహరించాయని సమంత తరపు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులున్నాయని, సమంత, నాగచైతన్యకు విడాకులు మంజూరు కాకముందే వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవి ఆమె వ్యక్తిగత, వృత్తిపర జీవితానికి ఇబ్బంది కలిగిస్తాయని, తక్షణమే ఈ కేసును విచారించాలని కోరారు. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం కేసును విచారణకు స్వీకరించి, ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.

కాగా, సోమవారం సమంత దాఖలు చేసిన పిటిషన్‌ పై మరోసారి వాదనలు జరిగాయి. సమంత ప్రతిష్ఠను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె తరపు న్యాయవాది బాలాజీ న్యాయస్థానాన్ని కోరారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తిపై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం సరైంది కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నామని, భవిష్యత్‌లో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెంక్షన్‌ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. గతంలో శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజెంక్షన్‌ ఆర్డర్ ఇచ్చిందని వాదనలు వినిపించారు. వాదనలు విన్న కూకట్‌పల్లి న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని