
Radheshyam: ‘రాధేశ్యామ్’ రిలీజ్.. గుప్పుమన్న వార్తలు
హైదరాబాద్: చాలా సంవత్సరాల తర్వాత పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) లవర్‌బాయ్ పాత్రలో నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’ (Radheshyam). ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. వింటేజ్ లవ్‌స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలుమర్లు వార్తలు వచ్చినప్పటికీ తమ ప్రాధాన్య మాత్రం థియేటర్లే అని చిత్రబృందం ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ‘రాధేశ్యామ్’ రిలీజ్‌పై వార్తలు గుప్పుమన్నాయి.
‘రాధేశ్యామ్’ని ఓటీటీ వేదికగానే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుందని.. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్, జీ5 నుంచి ‘రాధేశ్యామ్’కు భారీ ఆఫర్ వచ్చిందని.. టీమ్ కూడా అందుకు సుముఖంగా ఉందని తెలుస్తోంది. ఒకవేళ అన్నీ ఓకే అయితే ఈ రెండింటిలో ఏదో ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని నెట్టింట్లో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. తాజాగా జరుగుతోన్న ప్రచారంతో మరోసారి ‘రాధేశ్యామ్’ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటి పూజాహెగ్డే నటించారు.