‘డాక్టర్‌’ మళ్లీ వాయిదా

‘రెమో’, ‘శక్తి’ వంటి చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు వారికీ   దగ్గరయ్యారు నటుడు శివ కార్తికేయన్‌. ఇప్పుడాయన

Published : 14 May 2021 17:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘రెమో’, ‘శక్తి’ వంటి చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు వారికీ   దగ్గరయ్యారు నటుడు శివ కార్తికేయన్‌. ఇప్పుడాయన హీరోగా నెల్సన్‌ దిలిప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘డాక్టర్‌’. ప్రియాంక మోహన్‌ కథానాయిక. ఓ విభిన్నమైన వినోదాత్మక కథాంశంతో రూపొందింది. ఇప్పటికే  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈవారంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దీన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

పరిస్థితులు కాస్త కుదుట పడ్డాక కొత్త విడుదల తేదీపై స్పష్టత ఇస్తామని తెలియజేశారు. నిజానికి ఈ చిత్రం ఈ మార్చిలోనే  విడుదల కావాల్సి ఉంది. తమిళనాట ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెలకు వాయిదా వేశారు. కానీ, ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా మరోసారి వెనక్కు వెళ్లిపోయింది. ఈ సినిమా త్వరలో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని