Vijay: విజయ్‌-సమంత మరోసారి అలరించనున్నారా?

తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు అగ్ర కథానాయకుడు విజయ్‌(Vijay). ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నేరుగా ఓ తెలుగు చిత్రం చేస్తున్నారు.

Published : 05 Jun 2022 16:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు అగ్ర కథానాయకుడు విజయ్‌(Vijay). ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నేరుగా ఓ తెలుగు చిత్రం చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా తర్వాత ఆయన లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని కోలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయట. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఇండస్ట్రీలో ఆసక్తినెలకొంది. అంతేకాదు, ఇందులో కథానాయికగా సమంత పేరును పరిశీలిస్తున్నారట. గతంలో కూడా విజయ్‌-సమంత కలిసి ‘తేరి’, ‘మెర్సెల్‌’చిత్రాల్లో నటించారు.  విజయ్‌67వ చిత్రంగా ఇది తెరకెక్కే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని