Oo antava Mava: సామ్‌ ఐటమ్‌ సాంగ్‌తో ఇరగదీసిన జూనియర్‌ సమంత

లుక్స్‌ పరంగా సమంతని పోలి ఉండి జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్నారు నటి అషూ రెడ్డి. ఈ క్రమంలోనే ఆమె సమంత సినిమాల్లోని పలు డైలాగ్‌లకు డబ్‌స్మాష్‌ వీడియోలు చూసి సోషల్‌ మీడియాలో క్రేజ్‌ సొంతం....

Updated : 29 Jun 2023 18:17 IST

హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న ఆషూ రెడ్డి.. తాజాగా తన అభిమాన నటి ఆడిపాడిన స్పెషల్‌ సాంగ్‌కి కాలు కదిపారు. ‘‘ఊ అంటావా మామ ఊఊ అంటావా’’ అనే పాటకు కవర్‌సాంగ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్‌ వీడియోని సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘‘జూనియర్‌ సామ్‌ డ్యాన్స్‌తో ఇరగదీసింది’’, ‘‘ఇది వేరే లెవల్‌ డ్యాన్స్‌’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాలో సమంత స్పెషల్‌ సాంగ్‌తో అలరించిన విషయం తెలిసిందే. ‘జాను’ తర్వాత ఆమె సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించిన చిత్రమిదే. ‘ఊ అంటావా ఊఊ అంటావా’ సాంగ్‌లో సమంత వేసిన స్టెప్పులకు యువత మనసు పారేసుకున్నారు. దాంతో ‘పుష్ప’ ఆల్బమ్‌లో ఈ పాట ఫుల్‌ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన ఈ పాట ఫుల్‌ వీడియోని ఇప్పటివరకూ 21 మిలియన్ల మంది వీక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు