Pushpa: రికార్డులు బద్దలు కొడుతున్న సామ్‌ ‘ఊ అంటావా’ సాంగ్‌

‘పుష్ప’తో బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో...

Updated : 07 Dec 2022 19:49 IST

హైదరాబాద్‌: ‘పుష్ప’తో బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన ఆల్బమ్‌ కూడా అదే విధమైన సక్సెస్‌ని సొంతం చేసుకుంది. ఆల్బమ్‌ విడుదలై నాటి నుంచి ప్రతి పాటకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకుంది. అగ్రకథానాయిక సమంత మొదటిసారి ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయడం.. బన్నీతో ఆమె వేసిన మాస్‌ స్టెప్పులు.. ఇలా ఎన్నో విషయాలు ఈ పాట సక్సెస్‌కు దోహదపడ్డాయి. తాజాగా ఈ పాట 200పైగా మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ విషయంపై చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఊరమాస్‌ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక. సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని