Pushpa: సమంత ప్రత్యేక గీతం.. ‘ఊ అంటావా’ ఫుల్‌ వీడియో వచ్చేసింది

2021లో విడుదలై సెన్సేషన్‌గా మారిన ‘ఊ అంటావా ఊఊ ఉంటావా’ గీతం ఫుల్‌ వీడియో వచ్చేసింది.

Updated : 07 Dec 2022 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్: 2021లో విడుదలై సెన్సేషన్‌గా మారిన ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ గీతం ఫుల్‌ వీడియో వచ్చేసింది. సమంత నర్తించటంతో ఈ పాట లిరికల్‌ వీడియోనే యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. విడుదలైన క్షణం నుంచే లక్షల వ్యూస్‌ సొంతం చేసుకుని, ఫుల్‌ వీడియో ఎప్పుడొస్తుందా? అని అందరూ ఎదురుచూసేలా చేసింది. ఆ క్షణం రానే వచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా ‘పుష్ప’ చిత్ర బృందం ఈ ప్రత్యేక గీతం ఫుల్‌ వీడియోను విడుదల చేసింది. అల్లు అర్జున్‌- సమంత స్టెప్పులు, వారి హావభావాలు అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. అల్లు అర్జున్‌ వైవిధ్యభరిత మ్యానరిజం మెప్పిస్తోంది. సమంత స్టార్‌ నాయికగా రాణిస్తూనే ఈ ఐటెమ్‌లో నర్తించటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అలా అందరి అంచనాల్ని అందుకుని ఆమె తానేంటో నిరూపించింది. 

సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబరులో విడుదలైన ఈ సినిమా అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని