Orange: 13 ఏళ్లు అయినా.. ఆ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలే..!

రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన ‘ఆరెంజ్‌’ (Orange) సినిమా రీ రిలీజ్‌ అయ్యింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Published : 26 Mar 2023 15:50 IST

హైదరాబాద్: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) కెరీర్‌ తొలినాళ్లలో నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘ఆరెంజ్‌’ (Orange). ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకుడు. జెనీలియా కథానాయిక. రామ్‌చరణ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేశారు. శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో దీనిని రీ రిలీజ్‌ చేయగా.. అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆయా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు, సినిమాహాళ్లలోనూ ఇదే సందడి కనిపించింది. అభిమానులు పాటలుపడుతూ డ్యాన్స్‌లు చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన మూడో చిత్రమిది. నాగబాబు (Naga Babu) నిర్మాత.  రీ రిలీజ్‌తో వచ్చే డబ్బు మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు నాగబాబు ఇటీవల వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు