Ori Devuda: మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రం.. ‘ఓరి దేవుడా’

విష్వక్‌ సేన్‌ కథానాయకుడిగా అశ్వత్‌ మారిముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’. తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా రూపొందింది. పీవీపీ సినిమా పతాకంపై నిర్మించారు. మిథిలా పార్కర్‌, ఆశా భట్‌ కథానాయికలు.

Updated : 23 Oct 2022 13:42 IST

విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా అశ్వత్‌ మారిముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’ (Ori Devuda). తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా రూపొందింది. పీవీపీ సినిమా పతాకంపై నిర్మించారు. మిథిలా పార్కర్‌, ఆశా భట్‌ కథానాయికలు. హీరో వెంకటేష్‌ దేవుడిగా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమాలో చాలా బాగా చేశానంటున్నారు. ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కర్ని టచ్‌ చేసే చిత్రమిది. దీన్ని ఓసారి చూశాక కూడా మళ్లీ ఇంకోసారి చూస్తే బాగుంటుందనిపిస్తుంది. సినిమాలో వెంకటేష్‌ వచ్చినప్పుడల్లా థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ నాకెంతో ఆనందాన్నిస్తుంది. తెలుగు పరిశ్రమలోకి ఇంత మంచి చిత్రంతో అడుగు పెట్టే అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. కచ్చితంగా ప్రతి ఒక్కరూ చిరునవ్వులు చిందిస్తూ బయటకొస్తారు’’ అంది నాయిక మిథిలా పార్కర్‌ పార్కర్‌. చిత్ర దర్శకుడు అశ్వత్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక్కసారి చూసి వదిలేసే చిత్రం కాదు. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమా. ఇందులోని ఎమోషన్స్‌తో ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతున్నారు. మాతృక ‘ఓ మై కడవులే’ విడుదలయ్యాక తమిళంలో నాకు పెద్ద పెద్ద స్టార్ల నుంచి అవకాశాలొచ్చాయి. కానీ, అవన్నీ కాదనుకొని తెలుగులోకి వచ్చి ఈ చిత్రం చేశానంటే దానికి కారణం పీవీపీ బ్యానర్‌, విష్వక్‌ సేన్‌తో ఉన్న అనుబంధమే. వెంకటేష్‌ పోషించిన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా భట్‌, వెంకటేష్‌ కాకుమాను, లియో జేమ్స్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని