oscars 2023: ఆస్కార్‌ సాధించిన సినిమాలు.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్నాయంటే!

ఆస్కార్‌ బరిలో నిలిచి.. గెలిచిన సినిమాలు ఏ ఓటీటీల్లో  స్ట్రీమింగ్‌ అవుతున్నాయో తెలుసుకునే పనిలో పడ్డాడు సినీ ప్రియులు. ఇంకెందుకు  ఆలస్యం.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతుందో చూసేయండి..

Updated : 13 Mar 2023 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆస్కార్ (Oscars 2023) అవార్డుల గురించే. ఈ వేడుక లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. దీంతో ఆస్కార్‌ అవార్డులు గెలిచిన చిత్రాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయో అభిమానులు తెగ వెతికేస్తున్నారు.

ఆస్కార్‌లో ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొని రికార్డు సృష్టించిన సినిమా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుండగా.. భారత్‌ నుంచి షార్ట్‌ షిల్మ్‌ విభాగంలో ఆస్కార్‌ గెలుచుకున్న ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అలరిస్తోంది. ఆస్కార్‌ అవార్డులు పొందిన వాటిల్లో కొన్ని చిత్రాలు.. ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయంటే..

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ : సోనీలీవ్‌ (SonyLiv)

ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ : నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

బ్లాక్‌పాంథర్‌-వకండా ఫరెవర్‌ : డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)

అవతార్‌ 2: అమెజాన్‌ ప్రైమ్‌, యాపిల్‌ టీవీ, వుడ్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ (అద్దె ప్రాతిపదికన త్వరలోనే అందుబాటులోకి)

టాప్‌ గన్‌: మావెరిక్‌:  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime.. తెలుగు ఆడియో కూడా ఉంది)

• ఆర్‌ఆర్‌ఆర్‌ : జీ5, డిస్నీ + హాట్‌ స్టార్‌ (Zee5, Disney+ Hotstar)

ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ : నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

పినాషియో : నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)

• ఉమెన్‌ టాకింగ్‌, నవానీ, ది వేల్‌..  చిత్రాలు ప్రస్తుతం భారత్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని