Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’కు ఓటీటీ నుంచి భారీ ఆఫర్‌..!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లా ఈ చిత్రం కూడా వాయిదా పడొచ్చని ఊహాగానాలు వెల్లువెత్తగా.. చిత్రబృందం వాటిని ఖండించింది. ఖరారు చేసిన

Updated : 05 Jan 2022 07:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లా ఈ చిత్రం కూడా వాయిదా పడొచ్చని ఊహాగానాలు వెల్లువెత్తగా.. చిత్రబృందం వాటిని ఖండించింది. ఖరారు చేసిన తేదీకే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అయితే.. తాజాగా ఈ చిత్రానికి ఓటీటీ నుంచి భారీ ఆఫర్‌ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తిరిగి ఆంక్షల విధింపు మొదలైన విషయం తెలిసిందే. ఆ ప్రభావం థియేటర్లపై పడుతుండటంతో భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలకు వెనకడుగు వేస్తున్నాయి. ‘రాధేశ్యామ్‌’ మాత్రం జనవరి 14నే విడుదల అవుతోంది. కాగా.. ఆంక్షలు తీవ్రమైతే ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశముంది. ఇదే అదునుగా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ.. ‘రాధేశ్యామ్‌’ చిత్రాన్ని నేరుగా తమ ప్లాట్‌ఫాంలో విడుదల చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ‘రాధేశ్యామ్‌’ హక్కుల కోసం చిత్ర నిర్మాతలకు రూ.350కోట్లు ఆఫర్‌ చేసిందట. అయితే, ఓటీటీలో విడుదల చేసే ఆలోచన చిత్ర దర్శకుడికి లేదని తెలుస్తోంది. కానీ, కనీసం రూ. 450కోట్ల ఆఫర్‌ వస్తే ఓటీటీకి హక్కుల విక్రయంపై యోచించే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘రాధేశ్యామ్‌’ విడుదలపై చిత్రబృందం స్పష్టత ఇచ్చినా ఒకవైపు కరోనా.. మరోవైపు ఓటీటీ ఆఫర్‌తో విడుదలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని