Ott Movies: ఈ వారం ఓటీటీలో రాబోతున్న కొత్త చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
Ott Movies: ఫిబ్రవరి చివరి వారంలో ప్రేక్షకులను అలరించే ఓటీటీ చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
Ott Movies: ఇప్పటివరకూ థియేటర్‌లో అలరించిన పలు చిత్రాలు ఇక ఇప్పుడు ఓటీటీ అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటితో పాటు, కొన్ని వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. మరి ఈ వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి వస్తున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
‘వారసుడు’ వచ్చేశాడు..
విజయ్ (Vijay) కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘వారిసు’. సంక్రాంతి సందర్భంగా ‘వారసుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కుటుంబ కథా చిత్రంగా పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఫిబ్రవరి 22వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబమంతా కలిసి చూడాలనుకుంటే మంచి ఆప్షన్.
‘వీరసింహారెడ్డి’ కూడా..
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘వీరసింహారెడ్డి’ (veera simha reddy). శ్రుతిహాసన్ కథానాయిక. ఫిబ్రవరి 23, అంటే గురువారం సాయంత్రం 6గంటల నుంచి ‘వీరసింహారెడ్డి’ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కన్నడ చిత్రం తెలుగులోనూ..
దర్శన్ కథానాయకుడిగా వి.హరికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాంతి’. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌వీడియో వేదికగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కన్నడతో పాటు, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను అందుబాటులో ఉండనుంది.
‘మైఖేల్’ మెరుపులు..
సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మైఖేల్’ (michael ott release date). ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఈ చిత్రాన్ని అందుబాటులోకి రానుంది.
‘వీరయ్య’ వస్తున్నాడు!
చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya). శ్రుతిహాసన్ కథానాయిక. రవితేజ కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
* అవుటర్ బ్యాంక్ (వెబ్‌సిరీస్3) ఫిబ్రవరి 23
* వియ్ హేవ్ ఎ ఘోస్ట్ (హాలీవుడ్) ఫిబ్రవరి 24
* ఎ క్వైట్ ప్లేస్2 (హాలీవుడ్) ఫిబ్రరి 24
* నాన్‌పాకల్ నేరత్తు మయ్యక్కం (తెలుగు/మలయాళం) స్ట్రీమింగ్ అవుతోంది.
డిస్నీ+హాట్‌స్టార్
* రబియా అండ్ ఒలీవియా (హాలీవుడ్) ఫిబ్రవరి 24
* వన్స్ అపాన్ ఎ టైమ్ (అనిరుధ్ మ్యూజిక్ కన్సర్ట్) ఫిబ్రవరి 24
సోనీలివ్
* ఇరు ధ్రువం2 (తమిళ్ ) వెబ్‌సిరీస్ (సీజన్2)
* పొట్లక్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 24
సన్‌నెక్ట్స్
* అబ్ర (కన్నడ) ఫిబ్రవరి 24
జీ5
* వాల్వీ (మరాఠీ) మూవీ ఫిబ్రవరి 24
* పులిమేక (తెలుగు) వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 24
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
మళ్లీ జాగ్రత్త పడాల్సిందేనా!..140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్ కేసుల నమోదు
-
Politics News
2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు
-
India News
విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడే: ఫరూక్ అబ్దుల్లా
-
Sports News
దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్
-
Ts-top-news News
నేడు, రేపు వడగళ్ల వర్షాలు
-
Ts-top-news News
పసిపాపకు మంత్రి హరీశ్‌రావు అండ.. ‘ఈనాడు’ కథనానికి స్పందన