OTT Movies: ఈ వారం ఓటీటీలో 16 మూవీలు/వెబ్‌సిరీస్‌లు

OTT Movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా? ఎక్కడ ఏ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుందో చూడండి.

Updated : 04 May 2023 16:25 IST

Ott Movies: ఒక పక్క వరుస సినిమాలు థియేటర్‌లో సందడి చేస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. మరోవైపు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలతో పాటు, సరికొత్త సినిమాలు సైతం ఓటీటీని పలకరిస్తున్నాయి. అలా ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న చిత్రాలేంటో చూసేయండి.

క్యూట్‌ లవ్‌ స్టోరీ

నాగశౌర్య (Naga Shaurya), మాళవిక నాయర్‌ (Malavika Nair) జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi). శ్రీనివాస్‌ అవసరాల దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓకే అనిపించింది. ఇప్పుడు సన్‌నెక్ట్స్‌ ఓటీటీ వేదికగా మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.


ఓటీటీలో మీటర్‌

కిరణ్‌ అబ్బవరం (kiran abbavaram) కథానాయకుడిగా రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌  ‘మీటర్‌’ (Meter,meter ott release date). అతుల్య కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజాయన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మే 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.


నేరుగా ఓటీటీలో వస్తున్న ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’

సీనియర్‌ దర్శకుడు ఇ.సత్తిబాబు తెరకెక్కించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ (Match Fixing). విశ్వంత్‌, వసంతి కృష్ణన్‌, ప్రగ్యా నయన్‌, అభిజీత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు ఓటీటీ వేదిక ‘ఈ టీవీ విన్’ మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మ‌హాల‌క్ష్మి అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డిన ఇద్దరు యువ‌కుల క‌థ‌తో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.


‘16 ఆగస్టు 1947’న ఏం జరిగింది?

గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ సమర్పణలో రూపొందించిన చిత్రం ‘ఆగస్టు 16.. 1947’. ఎన్‌.ఎస్‌.పొన్‌కుమార్‌ తెరకెక్కించారు. రేవతి శర్మ, పుగాజ్‌, రిచర్డ్‌ ఆష్టన్‌, జాసన్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. టెంట్‌కొట్ట ఓటీటీ ఫ్లాట్‌ఫాం వేదికగా మే 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • శాంక్చురీ (మూవీ) మే 4
  • ది లార్వా ఫ్యామిలీ(యామినేషన్‌) మే 4
  • తూ ఝూటీ మై మక్కార్‌ (హిందీ) మే 5
  • 3 (తెలుగు) మే 5

  • అమృతం చందమామలో (తెలుగు) మే 5
  • యోగి (తెలుగు) మే5
  • రౌడీ ఫెలో (తెలుగు) మే 5
  • తమ్ముడు (తెలుగు) మే 5

జీ 5

  • ఫైర్‌ ఫ్లైస్‌ (హిందీ సిరీస్‌) మే 5
  • షెభాష్‌ ఫెలూద (బెంగాలీ)మే 5

డిస్నీ+హాట్‌స్టార్‌

  • కరోనా పేపర్స్‌ (మలయాళ చిత్రం ) మే 5
  • సాస్‌ బహూ ఔర్‌ ఫ్లమింగో (హిందీ) మే 5
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని