OTT Movies: ఓటీటీల్లో సందడే సందడి.. ఈవారం సినిమాలు+ సిరీస్‌లు 20కిపైగానే
ఓటీటీల వేదికగా ఈవారం అలరించనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలివి. ఏ సినిమా/సిరీస్ ఏ ఓటీటీలో అంటే?
ఇంటర్నెట్ డెస్క్: ఓ వైపు థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులకు ప్రతివారం వినోదాన్ని పంచుతున్నాయి. మరోవైపు, ఓటీటీ సంస్థలు అంతకు మించి అనేలా విభిన్న వెబ్‌సిరీస్‌లు, కొత్త సినిమాలు, థియేటర్లలో సందడి చేసిన చిత్రాలను ఆడియన్స్‌కు అందిస్తున్నాయి. అలా ఈ వారం సినిమాలు, సిరీస్‌లు కలిపి 20కిపైగా వస్తున్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేయండి..
సైలెంట్‌గా శాకుంతలం..
సమంత (Samantha) ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakunthalam). మహాకవి కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) వేదికగా గురువారం విడుదలైంది.
నవదీప్- బిందు మాధవిల ‘న్యూసెన్స్’
నవదీప్ (Navdeep), బిందు మాధవి (Bindu Madhavi) కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’ (Newsense). శ్రీప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సిరీస్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (Aha)లో మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మీడియా, రాజకీయం ఇతివృత్తంగా మదనపల్లి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిందీ సిరీస్.
సోనాక్షి తొలి సిరీస్.. ‘దహాడ్’
సోనాక్షి సిన్హా (Sonakshi Sinha), విజయ్‌వర్మ, గుల్షన్ దేవయ్య, సోహమ్ షా ప్రధాన పాత్రధారులుగా.. రీమా కగ్తీ, జోయా అఖ్తర్ తెరకెక్కించిన వెబ్‌సిరీస్ ‘దహాడ్’ (Dahaad). మే 12 నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. సోనాక్షి నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఇందులో ఆమె.. అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించనుంది.
నెట్‌ఫ్లిక్స్
- రాయల్ టీన్: ప్రిన్సెస్ మార్గరెట్ (హాలీవుడ్): స్ట్రీమింగ్ అవుతోంది.
- ఎరినీ (హాలీవుడ్): స్ట్రీమింగ్ అవుతోంది.
- ది మదర్ (హాలీవుడ్): మే 12
- క్రాటర్ (హాలీవుడ్): మే 12
- బ్లాక్ నైట్ (వెబ్ సిరీస్): మే 12
- క్వీర్ ఐ (వెబ్ సిరీస్): మే 12
- మల్లిగన్ (వెబ్ సిరీస్): మే 12
- తిరువిన్ కురల్ (తమిళ్): మే 12
అమెజాన్ ప్రైమ్
- సి.ఎస్.ఐ. సనాతన్ (తెలుగు): స్ట్రీమింగ్ అవుతోంది.
- విచిత్రం (మలయాళం): స్ట్రీమింగ్ అవుతోంది.
- ఎయిర్ (హాలీవుడ్): మే 12
- యాథిసయ్ (తమిళ్): మే 12
జీ5
తాజ్: ది రీన్ ఆఫ్ రివెంజ్ (హిందీ సిరీస్-2): మే 12
డిస్నీ+హాట్‌స్టార్
- ది మప్పెట్స్ మేహెమ్ (వెబ్‌సిరీస్): మే 10
- స్వప్న సుందరి (తమిళ/తెలుగు): మే 12
సోనీ లివ్
ట్రాయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్ (హాలీవుడ్): మే 12
జియో సినిమా
విక్రమ్ వేద (హిందీ): మే12
సన్‌నెక్ట్స్
రుద్రుడు (తమిళ్, తెలుగు): మే 14
ఆహా
- సి.ఎస్.ఐ. సనాతన్ (తెలుగు): స్ట్రీమింగ్ అవుతోంది.
- దాస్ కా ధమ్కీ (తమిళ్): మే 12
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
Sports News
ఆ బౌలర్ అరంగేట్రం.. అతడికి జాక్‌పాట్
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు