OTT Movies: ఈ వారం ఓటీటీలో రాబోతున్న చిత్రాలేవో తెలుసా?
ott movies: ఈ వీకెండ్లో ఓటీటీలో నెటిజన్లను అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు..
ఇంటర్నెట్‌డెస్క్: ప్రతి వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వీకెండ్లో చూసేందుకు అందుబాటులో ఉన్న ఆ సినిమాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
‘ఘోస్ట్’ వచ్చాడు..
నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. తాజాగా నవంబరు 2వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో సినిమా చూడలేకపోయిన వారికి ఈ వీక్ ఇదో ఛాయిస్
థియేటర్లో మెరుపులు ఓటీటీలో మెరుస్తాయా?
రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, అమితాబ్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర: పార్ట్-1 శివ’. భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 9న విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గ్రాఫిక్, విజువల్ వండర్‌గా టాక్ సొంతం చేసుకుంది తప్ప బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడంలో వెనకబడిపోయింది. నవంబరు 4వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
రెంట్ లేకుండా ‘పొన్నియిన్ సెల్వన్’ చూడొచ్చు!
మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఫస్ట్‌పార్ట్ సెప్టెంబరు 30న విడుదలై తమిళంలో మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన ఈ సినిమా చూసేందుకు వెసులుబాటు ఉండగా, నవంబరు 4వ తేదీ నుంచి ప్రైమ్ చందాదారులు ఉచితంగా చూడొచ్చు.
యువ హీరోలతో బాలయ్య సందడి
వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’తో అలరించిన బాలకృష్ణ సెకండ్ సీజన్లోనూ అదరగొడుతున్నారు. యువ కథానాయకులతో ఆయన చేసే సందడి ‘ఆహా’ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ వారం అడవి శేష్, శర్వానంద్‌లతో బాలకృష్ణ ముచ్చటించనున్నారు. నవంబరు 4వ తేదీ నుంచి ఈ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో అలరించనున్న మరికొన్ని చిత్రాలు/ వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్
* కిల్లర్ సాలీ నవంబరు 2
* ఎనోలా హోమ్స్ 2 (హాలీవుడ్) నవంబరు 4
* మేనిఫెస్ట్ సీజన్-4 (వెబ్‌సిరీస్) నవంబరు 4
* లుకిసిమ్ నవంబరు 4
*దావిద్ (మూవీ) నవంబరు 4
* బుల్లెట్ ట్రైన్ (హాలీవుడ్) నవంబరు 5
అమెజాన్ ప్రైమ్ వీడియో
* మై పోలీస్ మ్యాన్ నవంబరు 4
ఆహా
* పెట్టకాలి నవంబరు 4
సోనీలివ్
* కాయుమ్కలవుమ్ నవంబరు 4
జీ5
* తడ్కా (హిందీ) నవంబరు 4
* ఆమ్రపాలి (బెంగాలీ) నవంబరు 4
* బై జి కుట్టంగే (పంజాబీ) నవంబరు 4
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kiara Advani: సిద్ధార్థ్ ప్రపోజల్.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోను: కియారా అడ్వాణీ
కరణ్ జోహర్ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) కార్యక్రమంలో తాజాగా కియారా అడ్వాణీ (Kiara Advani), విక్కీ కౌశల్ సందడి చేశారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
Manchu Manoj: అందుకు నన్ను క్షమించాలి: మంచు మనోజ్
మంచు మనోజ్ (Manchu Manoj) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ గేమ్ షో ‘ఉస్తాద్’ (USTAAD RAMP ADIDHAM). ఈ ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
Ahimsa: సైలెంట్‌గా ఓటీటీలోకి ‘అహింస’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమైన సినిమా ‘అహింస’ (Ahimsa). తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. -
Kiara Advani: డ్యాన్స్ చేయమంటే నవ్వులు పంచిన కియారా: ఈ డ్రెస్సులో చేయలేనంటూ!
డ్యాన్స్ చేయమని అడిగితే ‘ఈ డ్రెస్సులో ఇంతకంటే ఎక్కువగా చేయలేను’ అంటూ హీరోయిన్ కియారా అడ్వాణీ నవ్వులు పూయించారు. ఎక్కడంటే? -
Japan movie ott release: ఓటీటీలో ‘జపాన్’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Japan movie ott release: కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘జపాన్’ మూవీ ఎలా ఉందంటే? -
Maa Oori Polimera 2: ఓటీటీలోకి ‘పొలిమేర 2’.. వారికి 24 గంటల ముందే స్ట్రీమింగ్
సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..? -
Jigarthanda Double X: ఓటీటీలోకి ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధానపాత్రల్లో నటించిన ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’(jigarthanda double x) ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది. -
Manoj Manchu: పవన్‌కల్యాణ్ మూవీ పేరుతో మంచు మనోజ్ కొత్త షో..!
Manoj Manchu: ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా అలరించేందుకు మంచు మనోజ్ సిద్ధమయ్యారు -
Naga Chaitanya: వైఫల్యాలు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పరు..: నాగచైతన్య
నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ దూత (Dhootha) డిసెంబర్ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్ జోరు పెంచింది. -
Rules Ranjann ott: ఓటీటీలో కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన ‘రూల్స్ రంజన్’ మూవీ ఎట్టకేలకు స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం.. విజేతలు ఎవరంటే..?
ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు వినోదం అందించిన పలువురు నటీనటులకు ఈ అవార్డులను అందించారు. -
Balakrishna: ఓటీటీలోనూ ‘భగవంత్ కేసరి’ హవా.. దర్శకుడికి కారు గిఫ్ట్..!
బాలకృష్ణ రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth kesari) తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్ట్రీమింగ్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చింది. -
Dhootha: ‘దూత’లోఎక్కువ సన్నివేశాలు వర్షంలోనే చిత్రీకరించారు: నాగచైతన్య
నాగచైతన్య తొలి వెబ్ సిరీస్ దూత (Dhootha) డిసెంబర్ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్ జోరు పెంచింది. -
Rashmika - Vijay Deverakonda: రష్మిక - విజయ్ దేవరకొండ.. లైవ్‌లో సీక్రెట్ చెప్పిన రణ్‌బీర్.. నటి షాక్
‘అన్‌స్టాపబుల్’ షోలో తాజాగా ‘యానిమల్’ (Animal) టీమ్ సందడి చేసింది.తమ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకుంది. -
Bhagavanth Kesari Ott: ఓటీటీలో బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bhagavanth Kesari Ott Release: బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘భగవంత్ కేసరి’ ఓటీటీలోకి వచ్చేసింది. -
The Vaccine War Ott: ఓటీటీలో ‘ది వ్యాక్సిన్ వార్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది వ్యాక్సిన్ వార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది -
అలియాని హీరోయిన్గా తీసుకోవద్దని ఇద్దరు హీరోలు మెసేజ్ పెట్టారు: ప్రముఖ దర్శకుడు
కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ చాట్ షో ‘కాఫీ విత్ కరణ్ సీజన్ 8’. తాజాగా ఈ కార్యక్రమంలో యువ హీరోలు సిద్ధార్థ్ మల్హోత్ర, వరుణ్ ధావన్ సందడి చేశారు. ఈ సందర్భంగా కరణ్.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ రోజులు గుర్తు చేసుకున్నారు. -
Anurag Kashyap: ఆ విషయాన్ని తట్టుకోలేకపోయా.. రెండు సార్లు గుండెపోటుకు గురయ్యా: అనురాగ్ కశ్యప్
‘మ్యాగ్జిమమ్ సిటీ’ (Maximum City) ప్రాజెక్ట్ ఆగిపోవడంపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తాజాగా స్పందించారు. అర్ధాంతరంగా అది ఆగిపోవడం తనని ఎంతో బాధకు గురి చేసిందన్నారు. -
Oppenheimer: ఓటీటీలోకి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఓపెన్‌హైమర్’.. కండిషన్స్ అప్లయ్..!
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఓపెన్‌హైమర్’ (Oppenheimer) ఓటీటీలోకి అడుగుపెట్టింది. -
Martin Luther King: ఓటీటీలోకి ‘మార్టిన్ లూథర్ కింగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఏ ఓటీటీలో? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే? -
Leo: ఓటీటీలోకి ‘లియో’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
విజయ్(Vijay) తాజా చిత్రం ‘లియో’ ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అలరించనుంది.