OTT Movies: ఈ వారం ఓటీటీలో రాబోతున్న చిత్రాలేవో తెలుసా?
ott movies: ఈ వీకెండ్‌లో ఓటీటీలో నెటిజన్లను అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు..
ఇంటర్నెట్‌డెస్క్: ప్రతి వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వీకెండ్‌లో చూసేందుకు అందుబాటులో ఉన్న ఆ సినిమాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
‘ఘోస్ట్’ వచ్చాడు..
నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. తాజాగా నవంబరు 2వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో సినిమా చూడలేకపోయిన వారికి ఈ వీక్ ఇదో ఛాయిస్
థియేటర్‌లో మెరుపులు ఓటీటీలో మెరుస్తాయా?
రణ్‌బీర్‌కపూర్, అలియాభట్, అమితాబ్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర: పార్ట్-1 శివ’. భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 9న విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గ్రాఫిక్, విజువల్ వండర్‌గా టాక్ సొంతం చేసుకుంది తప్ప బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడంలో వెనకబడిపోయింది. నవంబరు 4వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
రెంట్ లేకుండా ‘పొన్నియిన్ సెల్వన్’ చూడొచ్చు!
మణిరత్నం కలల ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఫస్ట్‌పార్ట్ సెప్టెంబరు 30న విడుదలై తమిళంలో మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన ఈ సినిమా చూసేందుకు వెసులుబాటు ఉండగా, నవంబరు 4వ తేదీ నుంచి ప్రైమ్ చందాదారులు ఉచితంగా చూడొచ్చు.
యువ హీరోలతో బాలయ్య సందడి
వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’తో అలరించిన బాలకృష్ణ సెకండ్ సీజన్‌లోనూ అదరగొడుతున్నారు. యువ కథానాయకులతో ఆయన చేసే సందడి ‘ఆహా’ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ వారం అడవి శేష్, శర్వానంద్‌లతో బాలకృష్ణ ముచ్చటించనున్నారు. నవంబరు 4వ తేదీ నుంచి ఈ ఎపిసోడ్ ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో అలరించనున్న మరికొన్ని చిత్రాలు/ వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్
* కిల్లర్ సాలీ నవంబరు 2
* ఎనోలా హోమ్స్ 2 (హాలీవుడ్) నవంబరు 4
* మేనిఫెస్ట్ సీజన్-4 (వెబ్‌సిరీస్) నవంబరు 4
* లుకిసిమ్ నవంబరు 4
*దావిద్ (మూవీ) నవంబరు 4
* బుల్లెట్ ట్రైన్ (హాలీవుడ్) నవంబరు 5
అమెజాన్ ప్రైమ్ వీడియో
* మై పోలీస్ మ్యాన్ నవంబరు 4
ఆహా
* పెట్టకాలి నవంబరు 4
సోనీలివ్
* కాయుమ్‌కలవుమ్ నవంబరు 4
జీ5
* తడ్కా (హిందీ) నవంబరు 4
* ఆమ్రపాలి (బెంగాలీ) నవంబరు 4
* బై జి కుట్టంగే (పంజాబీ) నవంబరు 4
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
TDP Formation Day: ప్రజల జీవితాల్లో తెదేపా వెలుగులు నింపింది: చంద్రబాబు
-
India News
Karnataka: కర్ణాటక ఎన్నికలకు మోగనున్న నగారా.. వయనాడ్‌కూ షెడ్యూల్ ప్రకటిస్తారా?
-
Movies News
Taapsee: లక్ష్మీదేవి నెక్లెస్ వివాదం.. తాప్సీపై కేసు నమోదు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
మిమ్మల్ని కిడ్నాప్ చేస్తా!.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
-
Ap-top-news News
Vijayawada: నాడు అన్న క్యాంటీన్.. నేడు వ్యర్థాల కేంద్రం