Ott movies: ఈ వారం ఓటీటీలో 15కుపైగా చిత్రాలు.. ఇంకా వెబ్‌సిరీస్‌లు.. అవేంటో తెలుసా?

ott movies: ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలో సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

Published : 11 Nov 2022 01:13 IST

నెల రోజులు కూడా కాకుండానే..!

దీపావళి కానుకగా అక్టోబరు 21న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఓరి దేవుడా..!’ (Ori Devuda). గురువారం అర్ధరాత్రి (12 గంటలకు) నుంచి ఈ చిత్రం ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సడెన్‌ సర్‌ప్రైజ్‌తో సినీ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా తెరకెక్కిన ఈ ఫాంటసీ రొమాంటిక్‌ కామెడీ చిత్రంలో వెంకటేశ్‌ అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాతో మిథిలా పాల్కర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.


క్రైమ్‌ థ్రిల్లర్‌ కొనసాగింపు..

అభిషేక్‌ బచ్చన్‌, అమిత్‌ సాద్‌, నిత్యామేనన్‌, సయామీఖేర్‌ తదితరులు కీలకపాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌’. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ వెబ్‌సిరీస్‌ తొలి భాగం ఎంతలా అలరించిందో అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఇప్పుడు సీజన్‌-2 స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌వీడియోలో అందుబాటులో ఉంది.


సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘రోషాక్‌’

మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి(Mammootty). ఆయన నటించిన తాజా చిత్రం రోషాక్‌‌(Rorschach). ఇటీవల థియేటర్‌లలో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా నవంబర్‌ 11 నుంచి డిజిటల్‌ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. నిషమ్‌ బషీర్‌ దర్శకత్వం వహించారు. పూర్తిగా విభిన్న కథాంశంతో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.


మిస్టరీ థ్రిల్లర్‌ ‘మోనికా.. ఓ మై డార్లింగ్‌’

రాజ్‌కుమార్‌ రావు, రాధికా ఆప్టే, హ్యూమాఖురేషి కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌ కామెడీ మూవీ ‘మోనికా, ఓ మై డార్లింగ్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 11న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.  హత్య చుట్టూ ఆసక్తికర కథా, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.


ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • ఇరావిన్‌ నిగళ్‌ (తమిళ చిత్రం) నవంబరు 11
  • సిక్సర్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 11
    నెట్‌ఫ్లిక్స్‌
  • బిహైండ్‌ ఎవ్రీ స్టార్‌  (కొరియన్‌ సిరీస్‌) నవంబరు 8
  • ద క్లాజ్‌ ఫ్యామిలీ 2 (డచ్‌ సిరీస్‌) నవంబరు 8
  • ట్రివియా వర్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 8
  • ద క్రౌన్‌ (వెబ్‌ సిరీస్‌)  నవంబరు 9
  • ఫాలింగ్‌ ఫర్‌ క్రిస్మస్‌ (హాలీవుడ్‌ ) నవంబరు 10
  • లాస్ట్‌ బుల్లెట్‌  (ఫ్రెంచ్‌ మూవీ) నవంబరు 10
  • వారియర్‌ నన్‌ (వెబ్‌సిరీస్‌-2) నవంబరు 10
  • పూచాంది (తమిళ్‌) నవంబరు 11
  • ఏన్సెంట్‌ అపోకలిప్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 11
  • థాయ్‌ మసాజ్‌ (హిందీ) నవంబరు 11
  • క్యాప్చరింగ్‌ ది కిల్లర్‌ నర్స్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 11
  • మై ఫాదర్స్‌ డ్రాగన్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 11
  • డిన్నర్‌ ఎట్‌ మై ప్లేస్‌ (ఇంగ్లీష్‌) నవంబరు 11

     

జీ5

  • ముఖ్‌బీర్‌: ది స్టోరీ ఆఫ్‌ ఎ స్పై (హిందీ సిరీస్‌) నవంబరు 11
  • గురు శిష్య (కన్నడ) నవంబరు 11
  • మై హూ మూసా (మలయాళం) నవంబరు 11
  • సేవింగ్స్‌ అకౌంట్‌ (బెంగాలీ) నవంబరు 11

    సోనీ లివ్‌

  • తనావ్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 11
    లయన్స్‌ గేట్‌ ప్లే
  • హాట్‌సీట్‌ (హాలీవుడ్‌) నవంబరు 11

    డిస్నీ పస్ల్‌ హాట్‌స్టార్‌

  • సేవ్‌ ఔర్‌ స్క్వాడ్‌ (ఒరిజినల్‌ సిరీస్‌) నవంబరు 09
  • మనీ మాఫియా (హిందీ సిరీస్‌3) నవంబరు 10
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని