Ott movies: ఈ వారం ఓటీటీలో అరడజను చిత్రాలు.. అలరించే వెబ్‌సిరీస్‌లు

Ott movies: ఈ వారం ఓటీటీలో ఇటు క్లాస్‌ వెబ్‌సిరీస్‌లతో పాటు, అటు మాస్‌ చిత్రాలు సందడి చేయనున్నాయి.

Published : 18 Nov 2022 01:50 IST

OTT Movies: ఈ వారం థియేటర్లలో పలు చిన్న చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవగా, ఓటీటీలో అదిరిపోయే మాస్‌బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు స్ట్రీమింగ్‌కు రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేయండి..

శ్రీను పెళ్లి... అయింది లొల్లి

‘ఇప్పటి నుంచి నా పెళ్లి అయ్యేంత వరకూ నేనే అమ్మాయి వెంట పడను’ అని ఓ బాలుడు తన తల్లికి ప్రమాణం చేస్తాడు. కట్‌ చేస్తే, పెరిగి పెద్దయ్యాక ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. మరి, ఆ యువకుడు తన తల్లి చూపించిన అమ్మాయిని వివాహమాడాడా, ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేశాడా? తెలియాలంటే ‘అహ నా పెళ్లంట!’ (Aha Na Pellanta) చూడాల్సిందే. రాజ్‌తరుణ్‌ ( Raj Tharun), శివానీ రాజశేఖర్‌ (Shivaani Rajashekhar) జంటగా నటించిన వెబ్‌ సిరీస్‌ ఇది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్‌ రూపొందినట్టు ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.


థియేటర్‌లలో మెప్పించి..

కార్తి కీలక పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్‌ ‘సర్దార్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర తెలుగు, తమిళ ఓటీటీ రైట్స్‌ను ఆహా దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీ నుంచి తెలుగు, తమిళ భాషల్లో  ‘సర్దార్’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రానికి పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహించారు.


మాస్‌ కా బాస్‌.. గాడ్‌ఫాదర్‌..

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన రీసెంట్‌ సూపర్‌హిట్‌ ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather). మోహన్‌ రాజా (MohanRaja) దర్శకుడు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలో నవంబర్‌ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.. మలయాళీ సూపర్‌హిట్‌ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఈసినిమా సిద్ధమైంది. పొలిటికల్‌ డ్రామాగా సిద్ధమైన ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.


మరికొన్ని చిత్రాలు /వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

* ది వండర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16

1899 (హాలీవుడ్‌)  నవంబరు 17

రిటర్న్‌ టు క్రిస్మస్‌ క్రీక్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

ఇలైట్‌ (హాలీవుడ్‌) నవంబరు 18

స్లంబర్‌ల్యాండ్‌( హాలీవుడ్‌) నవంబరు 18

ఇన్‌సైడ్‌ జాబ్‌ (సిరీస్‌) నవంబరు 18

రెజిన్‌ సుప్రీం సీజన్‌-1 (ఫ్రెంచ్‌) నవంబరు 18


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

హాస్టల్‌డేజ్‌ సీజన్‌-3 (వెబ్‌సిరీస్‌-హిందీ)  నవంబరు 16

ది సెక్స్‌లైవ్స్‌ ఆఫ్‌ కాలేజ్‌గర్ల్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 18


డిస్నీ+హాట్‌స్టార్‌

* ది సాంటా క్లాజ్‌ నవంబరు 16

* ఇరవతం (తమిళ్‌/తెలుగు) నవంబరు 17

సీతారామం (తమిళ్‌) నవంబరు 18


జీ5

కంట్రీ మాఫియా (వెబ్‌సిరీస్‌) నవంబరు 18


సోనీ లివ్‌

అనల్‌ మీలే పని తులి (తమిళ్‌) నవంబరు 18

వండర్‌ ఉమెన్‌ (తెలుగు) నవంబరు 18


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts