ott movies this week: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

ott movies this week: ఈ వారం థియేటర్‌లో అన్నీ చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. మరోవైపు ఓటీటీలో పలు కొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Updated : 21 Sep 2023 15:42 IST

మిస్టరీ థ్రిల్లర్‌తో కరీనా

సుజయ్‌ ఘోష్ దర్శకత్వంలో కరీనా కపూర్‌ ఖాన్‌, జైదీప్‌, విజయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘జానే జాన్‌’. జపనీస్‌ నవల ‘ది డివోషన్‌ ఆఫ్‌ సస్పెక్ట్‌ ఎక్స్‌’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబరు 21వ తేదీ నుంచి ‘జానే జాన్‌’ స్ట్రీమింగ్‌ కానుంది.


ఓటీటీలో మెప్పిస్తుందా?

వరుణ్‌ తేజ్‌ (Varun Tej) హీరోగా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’ (Gaandeevadhari Arjuna). ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో ఈ నెల 24 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. నాజర్‌, విమలా రామన్‌, వినయ్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 25న బాక్సాఫీసు ముందుకొచ్చి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.


ఓటీటీలో ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’

మహానటి’, ‘కనులు కనులు దోచాయంటే’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు దుల్కర్‌ సల్మాన్‌. అభిలాష్‌ జోషి దర్శకత్వంలో ఆయన నటించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. పాన్‌ ఇండియా మూవీగా ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు డిస్నీ+హాట్‌ స్టార్‌ వేదికగా సెప్టెంబరు 22 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం.


ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • సెక్స్‌ ఎడ్యుకేషన్‌ (వెబ్‌సిరీస్‌-4) సెప్టెంబరు 21
  • లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌సిరీస్‌-5) సెప్టెంబరు 22
  • సాంగ్‌ ఆఫ్‌ ది బండిట్స్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 22
  • అమెజాన్‌ ప్రైమ్‌
  • కస్సాండ్రో (హాలీవుడ్‌) సెప్టెంబరు 22
  • ది కాంటినెంటల్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 22
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • దిస్‌ పూల్‌(వెబ్‌సిరీస్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది
  • నో వన్‌ విల్‌ సేవ్‌ యూ (హాలీవుడ్) సెప్టెంబరు 22
  • బుక్‌ మై షో
  • మోర్టల్‌ కాంబాట్‌ లెజెండ్స్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 17
  • యాపిల్‌ టీవీ ప్లస్‌
  • స్టిల్‌ అప్‌ (వెబ్‌సిరీస్‌) సెప్టెంబరు 22
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని