ott movies: ఈ వారం ఓటీటీలో 15 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు.. ఏవి ఎక్కడంటే?
ott movies in telugu: ఈ వారం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు ఇవే!
ott movies in telugu: జూన్ మొదటి వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వస్తున్నాయి. మరి ఏ ఓటీటీ వేదికగా ఏయే చిత్రాలు వస్తున్నాయో చూసేయండి.
అల్లరి నరేశ్ ఉగ్రం
‘నాంది’ తర్వాత నరేశ్ (Naresh) కథానాయకుడిగా విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉగ్రం’ (Ugram). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా మే నెల ఆరంభంలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పటికీ నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఈసినిమా త్వరలో ఓటీటీ వేదికగా సినీ ప్రియులను అలరించనుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 2 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది.
నేరుగా ఓటీటీలో..
కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన తొలి హిందీ చిత్రం.. ‘ముంబైకర్’ (Mumbaikar). ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ చిత్రం జూన్ 2 నుంచి ‘జియో సినిమా’ (jio cinema)లో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. తెలుగులోనూ ఈ సినిమా సందడి చేయనుంది. ఈ ప్రకటనపై విజయ్ సేతుపతి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
- ఎ బ్యూటిఫుల్ లైఫ్ (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతోంది
- న్యూ ఆమ్‌స్టర్ డామ్ (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది
- ఇన్ఫినిటీ స్టోర్మ్ (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతోంది
- స్కూప్ (హిందీ సిరీస్) జూన్ 2
- మ్యానిఫెస్ట్ (వెబ్‌సిరీస్) జూన్2
జీ 5
- విష్వక్ (తెలుగు) జూన్ 2
- తాజ్: రిజిన్ ఆఫ్ రివెంజ్ సీజన్2 (హిందీ) (నాలుగు ఎపిసోడ్స్) జూన్2
- ఘర్ బందూక్ బిర్యాని (మరాఠీ) జూన్ 2
- హత్యపూరి (బెంగాలీ) జూన్ 2
డిస్నీ+ హాట్‌స్టార్
- సులైకా మంజిల్ (మలయాళం) మే 30
బుక్ మై షో
- ఈవిల్ డెడ్ రైజ్ (హాలీవుడ్) జూన్ 2
జియో సినిమా
- అసుర్ 2 (హిందీ సిరీస్) స్ట్రీమింగ్ మొదలైంది!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Dhoni: ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
-
US Speaker: అమెరికా చరిత్రలో తొలిసారి.. స్పీకర్‌కు ఉద్వాసన
-
Delhi Liquor Scam: ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
-
Asian Games: ఆర్చరీలో స్వర్ణం.. ఆసియా క్రీడల్లో భారత్ ‘పతకాల’ రికార్డ్
-
Stock Market: కొనసాగుతున్న నష్టాల పరంపర.. 19,400 దిగువకు నిఫ్టీ
-
AP BJP: ‘పవన్’ ప్రకటనలపై ఏం చేద్దాం!