Katrina-Vicky: కత్రినా-విక్కీ వివాహం.. ఓటీటీ ₹100కోట్ల ఆఫర్!
బాలీవుడ్లో పెళ్లి సందడి మొదలైంది. ప్రేమ జంట కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ డిసెంబర్ 9న వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. అయితే, రాజస్థాన్‌లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్ట్ భర్వారాలో జరిగే వారి వివాహానికి హాజరయ్యే అతిథులు ఫొటోలు, సెల్ఫీలు
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్లో పెళ్లి సందడి మొదలైంది. ప్రేమ జంట కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ డిసెంబర్ 9న వివాహబంధంతో ఒక్కటికాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. అయితే, రాజస్థాన్‌లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్ట్ భర్వారాలో జరిగే వీరి వివాహానికి హాజరయ్యే అతిథులకు పలు నిబంధనలు విధించారు. వివాహవేడుకలో ఫొటోలు, సెల్ఫీలు తీయొద్దు.. సోషల్‌మీడియాలో షేర్ చేయొద్దని ఆంక్షలు పెట్టారు. దీని వెనుక వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉన్నాయని తెలుస్తోంది.
తాజాగా కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ వివాహానికి సంబంధించి ఫొటోలు, వీడియోల ప్రసారహక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ రూ. 100కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే, ఈ విషయంలో కత్రినా-విక్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ ట్రెండ్ కొత్తేం కాదు.. గతంలోనూ పలువురు సెలబ్రిటీలు తమ వివాహా ఫుటేజ్‌ల ప్రసారాల కోసం సినీ మ్యాగజైన్లు, ఫొటోగ్రాఫర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే, ఒక ఓటీటీ సంస్థ వివాహావేడుక ప్రసార హక్కులను పొందేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి. ఒకవేళ కత్రినా-విక్కీ ఈ ఒప్పందానికి ఓకే చెబితే.. వారి వివాహ వేడుకని ఓటీటీ ప్రత్యక్షప్రసారం చేసే అవకాశముంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.