Godfather: ఓటీటీలోకి ‘గాడ్‌ఫాదర్’.. రిలీజ్ ఎప్పుడంటే..?
‘గాడ్ ఫాదర్’తో ఈ ఏడాది దసరాని తన ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాతో చిరు హిట్ అందుకున్నారు. ఇందులో మెగాస్టార్ గ్రేస్, నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన రీసెంట్ సూపర్‌హిట్ ‘గాడ్‌ఫాదర్’ (Godfather). మోహన్ రాజా (MohanRaja) దర్శకుడు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ‘గాడ్‌ఫాదర్’పై అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 19 నుంచి తమ ఫ్లాట్‌ఫామ్ వేదికగా ఈ సినిమా అందుబాటులో ఉండనుందని పేర్కొంది. మలయాళీ సూపర్‌హిట్ చిత్రం ‘లూసిఫర్’కు రీమేక్‌గా ఈసినిమా సిద్ధమైంది. పొలిటికల్ డ్రామాగా సిద్ధమైన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. సూపర్‌గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఈసినిమా నిర్మితమైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
Ap-top-news News
జరిమానాల రూపంలో రూ.1.16 కోట్ల వసూళ్లు
-
India News
ఒడిశాలో అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..