ott movies telugu: ఈ వారం ఓటీటీలో క్రేజీ మూవీలు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే!

OTT Movies this Week: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నాయి. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా రెడీగా ఉన్నాయి.

Updated : 11 Jul 2024 13:47 IST

సుధీర్‌ బాబు (Sudheer Babu) కీలక పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘హరోం హర’ (Harom Hara). ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదికగా  ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మాళవికా శర్మ హీరోయిన్‌. లక్కీ లక్ష్మణ్‌, రవి కాలే, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జ్ఞానసాగర ద్వారక దర్శకుడు. ఈటీవీ విన్‌తో పాటు, ‘ఆహా’ (Aha)లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.


ఫ‌హాద్ ఫాజిల్‌ (Fahad Faasil) కీలక పాత్రలో న‌టించిన మ‌ల‌యాళ (Malayalam) మూవీ ధూమం. అపర్ణ బాలమురళి కథానాయిక. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై సామాజిక సందేశం ఇవ్వడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.


విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో నిథిలన్‌ స్వామినాథన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మహారాజ’ (Maharaja). ఇటీవల విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా జులై 12 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది.


శ్రీకమల్‌, శివానీ రాజశేఖర్‌ జంటగా సీనియర్‌ దర్శకుడు కె.విజయభాస్కర్‌ (Vijay Bhaskar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జిలేబి’ (Jilebi ott).  గుంటూరు రామకృష్ణ నిర్మాత. గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో జులై 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని సినిమాలు/ సిరీస్‌లు

 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • మాస్టర్‌ మైండ్‌ (వెబ్‌సిరీస్‌) జులై 10
 • అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) జులై 12
 • కమాండర్‌ కరణ్‌ సక్సేనా (హిందీ) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • షో టైమ్‌ (వెబ్‌సిరీస్‌) జులై 12
 • నెట్‌ఫ్లిక్స్‌
 • రిసీవర్‌ (వెబ్‌సిరీస్) జులై 10
 • వైల్డ్‌ వైల్డ్ పంజాబ్‌ (హిందీ ) జులై 10
 • వైకింగ్స్‌ : వాల్‌ హల్లా 3 (వెబ్‌సిరీస్‌) జులై 11
 • ఎక్స్‌ప్లోడింగ్‌ కిటెన్స్‌ (యానిమేషన్‌ సిరీస్) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • సోనీలివ్‌
 • 36 డేస్‌ (హిందీ సిరీస్‌) జులై 12
 • జియో సినిమా
 • పిల్‌ (హిందీ సినిమా) జులై 12
 • సింప్లీసౌత్‌
 • మందాకిని (మలయాళం) జులై 12
 • అమెజాన్‌ ప్రైమ్‌
 • డైవోర్స్‌ ఇన్‌ ది బ్లాక్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • ది గార్‌ఫీల్డ్‌ (ఇంగ్లీష్‌ )స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • కింగ్‌డమ్‌ ఆఫ్‌ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • ది ఎక్సారిజమ్‌ (ఇంగ్లీష్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.
 • జీ5
 • కాకుడా (హిందీ) జులై 11
 • ఫిట్‌ర్యాట్‌ (సిరీస్‌) జులై 12
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని